రౌడీని ఆడుకున్న మిథాలీ అండ్ గ్యాంగ్

0

రౌడీ అందరినీ ఆడుకుంటాడు. కానీ ఇక్కడ రౌడీనే ఆడుకున్నారు. రౌడీ కొండ విజయ్ ను టీమిండియా లేడీ కెప్టెన్ మిథాలీ రాజ్ సహా కొందరు పిల్లలు సరదాగా ఆట పట్టించారు. డియర్ కామ్రేడ్ ప్రచారంలో భాగంగా అనాధ పిల్లలు కొందరు పోలీస్ అధికారుల సమక్షంలో ఏర్పాటు చేసిన సరదా చిట్ చాట్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ- రష్మిక మందన సహా కామ్రేడ్ టీమ్ పాల్గొంది. మిథాలీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ అనాధ బాలికలతో సరదా ముచ్చట్లు ఆడారు. ఆ ముచ్చట్లలో అన్నా మాకు కామ్రేడ్ గా ఉంటారా? అని ప్రశ్నిస్తే అందుకు తప్పకుండా ఉంటానని రౌడీ దేవరకొండ ప్రామిస్ చేశారు. 42 మంది అనాధ పిల్లల హోమ్ కి వస్తానని రౌడీ అన్నారు. కామ్రేడ్ పై రకరకాల ప్రశ్నలతో పిల్లలు ఉక్కిరి బిక్కిరి చేయడంతో అంతా కలిసి నాతో ఆడుకుంటున్నారని దేవరకొండ సరదాగా వ్యాఖ్యానించారు. ఇక ఈ వేడుకలో రష్మిక .. మిథాలీ రాజ్ సైతం రౌడీని ఆడుకున్నారు.

తెరపై మ్యాచ్ లో ఎవరు బాగా ఆడాం? అని రష్మికను చూపిస్తూ మిథాలీని ప్రశ్నించారు దేవరకొండ. మీకంటే రష్మికనే బాగా ఆడింది! అంటూ మిథాలీ దేవరకొండను ఆటపట్టించడం ఇంట్రెస్టింగ్. ఫీల్డ్ లో బ్యాటింగ్ ఎవరు బాగా చేశారు? అన్నది చూడాలి అంటూ రౌడీ బింకాన్ని ప్రదర్శించారు. మొత్తానికి సరదా చిట్ చాట్ ఆకట్టుకుంది. ఇక ఈ కార్యక్రమానికి అతిధిగా మిథాలీని పిలవడానికి కారణం.. కామ్రేడ్ చిత్రంలో క్రికెట్ ఆటనే. వర్క్ ప్లేస్ లో సెక్సువల్ వేధింపుల కాన్సెప్టుని కామ్రేడ్ సినిమాలో చూపించారు. లిల్లీ(రష్మిక)కి అలాంటి కష్టం కలిగినప్పుడు బాబీ (దేవరకొండ) ఎలా అండగా నిలిచాడు? అన్నదే సినిమా. డియర్ కామ్రేడ్ తొలి రోజు 11కోట్లు వసూలు చేసింది. తొలి వీకెండ్ తర్వాత భారీగా డ్రాప్స్ కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. నిలబెట్టేందుకు కామ్రేడ్ టీమ్ ఇలా ప్రచారకార్యక్రమాలతో హోరెత్తిస్తోంది.
Please Read Disclaimer