టిక్ టాక్ నిషేధం.. నాణేనికి రెండు వైపులు!

0

టిక్ టాక్.. మన సమాజానికి ఏం చేసిందంటే.. వినోదాన్ని పంచింది. ఎంతో మంది టాలెంట్ ను వెలికితీసింది..ఓవర్ నైట్ ఎంతో మందిని స్టార్స్ చేసింది..టిక్ టాక్ తో తమ టాలెంట్ ను నిరూపించుకున్న వారు ఎందరో.. కానీ వారికి రూపాయి ఆదాయం లేదు. పాపులారిటీతో భారీ యాడ్స్ పొంది టిక్ టాక్ సంస్థ కోట్లకు పడగలెత్తింది. ఇది నాణేనికి ఓ వైపు..

నాణేనికి ఇంకో వైపు.. టిక్ టాక్.. అక్రమ సంబంధాలను పెంచింది.. విశృంఖలత్వాన్ని ప్రోత్సహించింది. జనాల్లో ద్వేషం బూతు ఎక్కువైపోయింది.. నేర ప్రవృత్తిని పెంచింది. సమాజ పోకడలను మార్చింది. భారతీయ సంస్కృతిని ఖరాబ్ చేసింది.

ఇలా టిక్ టాక్ తో లాభమూ ఉంది.. అదే సమయంలో తీవ్ర నష్టమూ జరిగింది. కానీ జనాలు మాత్రం ఇది లేకుండా ఇప్పుడు రోజు గడవని పరిస్థితికి వచ్చారు. కేంద్రం తాజాగా చైనాతో కయ్యం నేపథ్యంలో టిక్ టాక్ సహా 59 యాప్స్ నిషేధించారు. ఈ క్రమంలోనే భారతీయుల్లో చర్చనీయాంశమైన ఈ యాప్ ఇక వాడకుండా పోయారు.

అయితే ఎంతో మంది తలరాతలు మార్చిన ఈ యాప్ ను నిషేధించవద్దని కోట్ల మంది టిక్ టాక్ లవర్స్ కేంద్రానికి మొర పెట్టుకున్నారు. కానీ దేశ భద్రత రక్షణ కోసం ఇలా చేయాల్సిందనేని టిక్ టాక్ వ్యతిరేకులు నినదిస్తున్నారు. మన ప్రాణాలకంటే ఈ ప్రత్యర్థి యాప్ ముఖ్యం కాదంటున్నారు.

ఇలా బలహీనతగా మారిపోయిన టిక్ టాక్ దేశ ప్రజలకు కనెక్ట్ అయ్యి దూరమైపోయింది. ఈ యాప్ లేకపోతే పిచ్చోళ్లు అయిపోయేవారు కూడా ఉన్నారు. ఈ యాప్ ను వద్దంటూ దీని రేటింగ్ ను బాగా తగ్గించిన వారూ ఉన్నారు. మొత్తంగా నిషేధానికి గురైన టిక్ టాక్ పై జనాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
Please Read Disclaimer