స్టార్ల డ్రగ్స్ అడిక్షన్ పై ఎమ్మెల్యే ఆరోపణ!

0

నైట్ పార్టీలు చేసుకున్న వాళ్లు సైలెంటుగా ఉండొచ్చు కదా..! కానీ వాటిని ఫోటోలు వీడియోలు తీసి ఆన్ లైన్ లో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తారు. అలా షేర్ చేశాక జనం ఊరుకుంటారా? తిట్టే వాళ్లు తిడతారు. ఆరోపించే వాళ్లు ఆరోపిస్తారు. అలా ఓ వీడియో సోషల్ మీడియాలోకి రిలీజ్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. డ్రగ్స్ బానిసలు అన్న నిందను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ వీడియో కాస్తా షేర్ చేస్తోంది ఎమ్మెల్యే కావడంతో అది కాస్తా మరింత జోరుగా వైరల్ అయిపోతోంది. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో సెలబ్రిటీలు ఎవరు? ఆ ఎమ్మెల్యే ఎవరు అన్నది తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాలి.

ఇటీవలే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కం నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ లో తన స్నేహితులందరికీ ఓ స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో ప్రముఖ బాలీవుడ్ స్టార్లంతా ఫ్లూటుగా ఎంజాయ్ చేశారు. దీపిక పదుకొణే- రణబీర్ కపూర్- షాహిద్ కపూర్- మీర్జా రాజ్ పుత్- వరుణ్ ధావన్- నటాషా దలాల్-మలైకా అరోరా- అర్జున్ కపూర్ తదితరులు ఈ పార్టీకి ఎటెండయ్యారు. వీళ్లంతా మత్తులో జోగుతున్న వీడియోని కరణ్ జోహార్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇంకేం ఉంది. ఈ వీడియో చూసిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ ఏడీ) ఎమ్మెల్యే మజీందర్ సింగ్ సిర్సా తీవ్రంగా విరుచుకుపడుతూ వీళ్లంతా డ్రగ్ అడిక్ట్స్ అంటూ ఆరోపించారు.

“డ్రగ్స్ మత్తులో జోగుతున్న బాలీవుడ్ ని చూడండి. వీళ్ల తీరుతెన్నుల్ని నేను వ్యతిరేకిస్తున్నాను. డ్రగ్స్ బానిసలైన ఈ స్టార్లకు వ్యతిరేకంగా నాతో గొంతు కలపండి“ అంటూ ఎమ్మెల్యే మజీందర్ సింగ్ తీవ్రంగానే విరుచుకుపడ్డాడు. రీల్ లైఫ్కి రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది. డ్రగ్స్ ను సేవించామని గర్వంగా ఫీలవుతున్న బాలీవుడ్ సెలబ్రీటీలను చూడండి! అంటూ ఆ వీడియోను వైరల్ గా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ప్రముఖుల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

View this post on Instagram

 

Saturday night vibes

A post shared by Karan Johar (@karanjohar) on
Please Read Disclaimer