మోహన్ బాబు కి అదొక్కటే బెంగ !

0

తెలుగు ఇండస్ట్రీ విలక్షణ నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు ఈరోజు. నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా సత్తాచాటిన ఆయన తెలుగు చిత్రసీమలో తిరుగులేని స్టార్ గా ఎదిగిన తీరు అందరికి ఆదర్శం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని విలన్ నుండి టాప్ హీరోగా మారారు. మోహన్ బాబు డైలాగ్స్ కొడితే థియేటర్లు విజిల్స్ తో మార్మోగిపోయేవి. దశాబ్దాల సినీ జీవిత చరిత్ర కలిగిన మోహన్ బాబు ఎన్నో అవార్డులు రివార్డులను అందుకొని ఎన్నో రికార్డులను తిరగరాశారు.

అంతటి చరిత్ర కలిగిన ఆయన ఈరోజే 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆయన కూతురు లక్ష్మిప్రసన్న కొడుకులు విష్ణు మనోజ్ లు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఈరోజు కుటుంబ సమక్షంలో పుట్టినరోజు వేడుకలను మోహన్ బాబు జరుపుకున్నారు. కూతురు లక్ష్మి ఆయన గురించి మాట్లాడుతూ.. ఆయనే తనకు ఆర్మీ అని ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లోనే నేను తమ్ముళ్లు విష్ణు మనోజ్ లు నడుస్తామని తెలిపింది.

అయితే ఇండస్ట్రీలో తిరుగులేని చరిత్ర సృష్టించిన మోహన్ బాబు నటవారసత్వాన్ని మాత్రం తన పిల్లలలో ఎవరూ తీసుకోలేదని ఆయన అభిమానులు వాపోతున్నారు. లక్ష్మి విష్ణు మనోజ్ లు సినిమాలు చేస్తూ ఉన్నా సరైన హిట్లు లేక వెనకబడ్డారని ఆయన స్టార్డంను ఎవరూ అందుకోలేక పోతున్నారని అభిమానులలో నిరాశ నెలకొంది. వ్యక్తిగత జీవితాలలో సక్సెస్ అయినా నటన పరంగా మాత్రం ఎందుకు సక్సెస్ కాలేక పోతున్నారు అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇకనైనా డైలాగ్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని ముగ్గురిలో ఎవరో ఒకరు తీసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

‘డైలాగ్ కింగ్’ మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ అదే చిరునవ్వుతో ముక్కుసూటి తనంతో ఆయురారోగ్యాలతో ఎన్నో వసంతాలు జీవించాలని ప్రార్ధిస్తూ.. మీ TeluguNow.com
Please Read Disclaimer