మోహన్ బాబును భయపెట్టేది ఒకే ఒక్కరట

0

ఇండస్ట్రీలో మోహన్ బాబుకు చాలా మంది భయపడతారు. ఆయన అంటే భయం వల్ల చాలా మంది యువ దర్శకులు ఆయన్ను తమ సినిమాల్లోకి తీసుకోవాలనుకున్నా ఆయనతో వర్క్ చేయించుకోవడం కష్టం అవుతుందేమో అనే ఉద్దేశ్యంతో వద్దులే అనుకుంటారట. ఆయన ఇంటర్వ్యూలు అడిగేందుకు కూడా మీడియా వారు కాస్త వెనకడుగు వేస్తారంటూ ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఎలాంటి ప్రశ్నలు ఆయన్ను వేయాలి.. ఎలాంటివి వేస్తే ఆయన కోపగించుకుంటారు అని ముందు ఆలోచించుకుని ఆ తర్వాత ఇంటర్వ్యూకు వెళ్తారట.

ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెళ్లడించాడు. అదే సమయంలో దర్శకులు మీరంటే భయం వల్ల మంచి పాత్రలు ఉన్నా కూడా మీ వద్దకు రాలేక పోతున్నారు అంటే ఫన్నీగా స్పందించాడు. వారందరికి మందు పార్టీ ఇవ్వాలా లేదంటే ముంబయి ఢిల్లీ తీసుకు వెళ్లి వారికి పార్టీలు ఇవ్వనా అంటూ ప్రశ్నించాడు. వారు ఎందుకు భయపడుతున్నారో వారినే అడగాలని కూడా మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

ఇక అందరు మోహన్ బాబు అంటే భయపడితే ఆయన మాత్రం తన కూతురు లక్ష్మి మంచుకు భయపడతాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. కేవలం ఆమె అంటేనే నాకు భయం. అన్ని విషయాల్లోను ఆమెంటే నాకు భయం. రాక్షసిలాగా ప్రవర్తిస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడా కోపగించుకుంటుంది. ప్రతి విషయానికి అలుగుతుంది. నా కోపం ఆమెకు వచ్చింది. ఇంక ఎవరికి భయపడను కాని ఆమెకు అంత భయపడతాను. ఎంత భయపడతానో అంతగా ప్రేమిస్తానంటూ కూతురుపై ఉన్న ఆప్యాయతను మోహన్ బాబు తెలియజేశాడు.
Please Read Disclaimer