గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా… యాంకర్ ప్రశ్నకు మోహన్ బాబు కౌంటర్

0

మోహన్ బాబు టాక్ షోల్లో.. ఇంటర్వ్యూల్లో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు యాంకర్స్ కూడా భయపడతారు. మోహన్ బాబుకు కోపం ఎక్కువ.. ఆయన అరిచేస్తాడు అంటూ ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే ఆయనతో చిన్న దర్శకులు పని చేసేందుకు భయపడుతున్నారని.. పెద్ద దర్శకులు కూడా ఆయనతో వర్క్ చేయించుకోవడం కష్టం అంటూ ఆయనకు దూరంగా ఉంటారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి మోహన్ బాబును ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంకర్ గర్ల్ ఫ్రెండ్స్ విషయమై ఒక ప్రశ్న అడిగి ఆ తర్వాత జుట్టు పీక్కున్నాడు. ఈ ప్రశ్న ఎందుకు అడిగానురా బాబోయ్ అనుకుని ఉంటాడు ఆ యాంకర్.

ప్రాంక్లీ విత్ టి యన్ ఆర్ షో మోహన్ బాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో టీఎన్నార్ పలు విషయాలను ప్రశ్నించారు. అదే సమయంలో మోహన్ బాబును మీకు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు సర్ అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మోహన్ బాబు నవ్వుతూనే టి యన్ ఆర్ కు చురకలు అంటించారు. ఎలాంటి ప్రశ్నలు అడగాలో మీకు తెలియదా అంటూ కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారు.

ప్రశ్నకు మోహన్ బాబు సమాధానం చెబుతూ.. గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి కాకముందు ఉండేవారేమో.. పెళ్లి అయిన తర్వాత మాత్రం ఏక పత్నీవ్రతుడిని అని చెప్తాను. మీరు ఏ ప్రశ్న వేస్తే ప్రజలకు బాగుంటుందని కాకుండా పర్సనల్ గా వెళ్లారు. నేను మిమ్ములను అడుగుతాను.. మీరు చదువుకునేప్పుడు ప్రేమించలేదా. మీరేమైనా సత్యశీలులా మీకు ప్రేమలు ఉండవా. నేను ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు. ఒక అమ్మాయి నన్ను ఇష్టపడ్డప్పుడు ఆమెను నేను ఇష్టపడ్డప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం తప్ప ఎప్పుడు నేను అమ్మాయిలను ఇబ్బంది పెట్టలేదు. ఏ అమ్మాయిని బలవంత పెట్టలేదు.

మీరు ఛానెల్ అధినేత కావచ్చు కాని మిమ్ములను నేను ఇంటర్వ్యూ చేస్తే దిమ్మ తిరిగి మళ్లీ మీ ఆవిడ ఇంట్లోకి రాకుండా చేస్తుంది. మీరు ఆ తర్వాత బోజనం కూడా చేయలేరు.. అలా నేను కూడా మిమ్ములను ప్రశ్నలు వేయగలను. మీరు మమ్ములను ప్రశ్నిస్తారు కాని మేము మిమ్ములను ప్రశ్నించకూడదా.. మీరేమైన దేవుళ్లా అంటూ నవ్వుతూనే ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పదే పదే ఒక విషయాన్ని అడిగి ఏదైనా సంచలనం దొరికితే టీవీల్లో రోజుకు 20 సార్లు వేద్దాం అనుకుంటున్నారు. ఈ వయసులో నేను విధ్యాలయాల అధినేతగా ఉన్నాను. వాటికి సంబంధించిన ప్రశ్నలు లేదంటే మరో ముఖ్యమైన విషయాల గురించి ప్రశ్నించాలంటూ యాంకర్ టి యన్ ఆర్ కు సున్నితంగా మోహన్ బాబు హెచ్చరిక చేశాడు.
Please Read Disclaimer