58 వయసులో 28 ఏళ్ల వర్క్ అవుట్స్

0

అదేదో సినిమా పాటలో చెప్పినట్టు మెగాస్టార్లు సూపర్ స్టార్లు ఒక్క రోజులోనో ఒక్క రాత్రిలోనో అయిపోరు. దాని వెనుక ఏళ్ళ తరబడి కష్టం చిందించిన చెమట ఎంతో ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు మలయాళం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్. 58 ఏళ్ళ ముదిమి వయసులోనూ జిమ్ లో కసరత్తులు చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ఆయన పడుతున్న శ్రమను చూస్తే యువతరం సైతం ఔరా అని నోరెళ్ళబెట్టాల్సిందే.

త్వరలో మొదలుపెట్టబోయే ప్రాజెక్ట్ కోసం ఒంటిని షేప్ చేసుకునే పనిలో ఉన్న మోహన్ లాల్ కొత్త సినిమా లూసిఫర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీని ట్రైలర్ ఆన్ లైన్ లో సంచలనం రేపుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన లూసిఫర్ లాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవబోతోంది.ఇప్పుడీ వర్క్ అవుట్స్ తాలూకు ఫోటోలు చూసి ఫాన్స్ ఫ్లాట్ అయిపోతున్నారు. లాల్ ని కంప్లీట్ యాక్టర్ అని ఎందుకు అంటారో అర్థం చేసుకోమంటూ వీటిని వైరల్ చేస్తున్నారు.

గత ఏడాది ఒడియన్ డిజాస్టర్ తో కాస్త దెబ్బ తిన్న మోహన్ లాల్ లూసిఫర్ కాకుండా మరక్కర్ అనే మల్టీ స్టారర్ కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల మీదే సుమారు 200 కోట్లకు పైగా పెట్టుబడులు జరుగుతున్నాయి. కొడుకుని హీరోగా లాంచ్ చేసాక కూడా రెస్ట్ తీసుకోకుండా ఇంత లేట్ ఏజ్ లోనూ కష్టపడుతున్న మోహన్ లాల్ ని చూస్తుంటే ఎవరికైనా ఇన్స్ పిరేషన్ గానే అనిపిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత మనమంతా జనతా గ్యారేజ్ లాంటి స్ట్రెయిట్ మూవీస్ ద్వారా పలకరించిన మోహన్ లాల్ వీటి తర్వాత తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఏదీ ఒప్పుకోలేదు
Please Read Disclaimer