మైత్రి బంధం వీడినట్టేనా?

0

ముగ్గురు స్నేహితులు నిర్మాతలుగా మారి ఒక సంస్థను స్థాపించి మొదటి మూడు సినిమాలతోనే బ్లాక్ బస్టర్లు సాధించడం చిన్న విషయం కాదు. అందుకే మైత్రి మూవీ మేకర్స్ అతి తక్కువ టైంలోనే అగ్రస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత కొన్ని పరాజయాలు పలకరించినా వరుసగా ప్రాజెక్ట్స్ ని నిర్మించే విషయంలో మాత్రం దూకుడు కొనసాగిస్తూనే వచ్చారు. ఆ ముగ్గురు నవీన్-రవి శంకర్-మోహన్. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఇందులో కీలక బాద్యతలు నిర్వర్తిస్తున్న మోహన్ మైత్రి నుంచి బయటికి వచ్చేస్తున్నారట.

అంతర్గతంగా ఏవో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు కాని వాటి మీద స్పష్టత కొరవడుతోంది. శుక్రవారం విడుదల కానున్న డియర్ కామ్రేడ్ తో పాటు ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఉప్పెన కు మాత్రమే సంయుక్తంగా ఈ ముగ్గురి పేర్లు ఉంటాయని ఆపై మోహన్ విడిగా సినిమా నిర్మాణాలు చేసుకుంటారని తెలుస్తోంది. సినిమా స్నేహాలు ఒకోసారి ఇలాగే అనూహ్య పరిస్థితుల్లో విడిపోయేందుకు దారి తీస్తాయి. 90 దశకంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా పేరొందిన రాజ్ కోటిలు ఆ తర్వాత విడిపోవడం అందరిని షాక్ కు గురి చేసింది.

బాలీవుడ్ లోనూ సలీం జావేద్ లు లక్ష్మి కాంత్ ప్యారే లాల్ లు ఇదే తరహలో స్నేహానికి గుడ్ బై చెప్పుకున్న వాళ్ళే. ఇద్దరు నిర్మాతలు ఉన్న బ్యానర్లలో ఇలాంటి విడిపోతలు టాలీవుడ్ లోనూ ఎన్నో జరిగాయి. కాకపోతే మైత్రికి అతి తక్కువ టైంలో ఇలాంటి సందర్భం వచ్చింది. ఇది అధికారికంగా ప్రకటించలేదు కాని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఎలాగూ తెలిసిపోతుంది కాబట్టి అఫీషియల్ నోట్ ఇచ్చే అవకాశం లేకపోవచ్చు
Please Read Disclaimer