ఆ స్టార్ యాక్టర్ ‘ఎన్టీఆర్’తో మళ్లీ నటించట్లేదట!

0

తెలుగు ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే మంచి క్రేజ్ ఉంది. ఇదివరకే వీరిద్దరూ కలిసి అరవింద సమేత సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఎన్టీఆర్ సినీ కెరీర్లో అరవింద సమేత మంచి స్థానాన్ని సంపాదించింది. ఒక డైలాగ్ రైటర్.. ఒక బ్రహ్మాండమైన డైలాగ్ డెలివరీ గల హీరో కలిస్తే ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ చూపించేసారు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ తో పాటు కొత్తరకం డైలాగ్స్ పలికించాడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీ అయిపోయాడు. ఈ ఏడాది త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురంలో’ హిట్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ఖరారు చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల మీదనే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం అవుతారట. మరో విషయం ఏంటంటే.. పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు ఓ కీలక పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి. అయితే అలాంటిది ఏం లేదు మోహన్ కేవలం పుకారేనట. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చేస్తున్న సినిమా కాబట్టి బాలీవుడ్ లో ఈ స్టార్ హీరో కు మార్కెట్ ఏర్పడుతుంది. ఆ విషయం దృష్టి లో పెట్టుకొని ఈ సినిమా ను పాన్ ఇండియా మూవీ గా రూపొందించే ఆలోచన లో ఉన్నారట. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ నిజమైతే గనక నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
Please Read Disclaimer