మోక్షజ్ఞను వదిలెయ్యండిరా బాబూ!

0

హీరో కొడుకు హీరో కావాలి. ఒకవేళ అలా కాకపోతే అందరూ కలిసి అతన్ని టార్చర్ పెట్టి అతన్ని బలవంతంగా హీరోను చేసేలా ఉన్నారు. ఒక వ్యక్తి తనకు నచ్చిన కెరీర్ ఎంచుకునే హక్కు ఉంది. ఒక వ్యక్తి సన్నగా ఉండాలో.. లావుగా ఉండాలో లేక కసరత్తులు చేసే గ్రీకు గాడులా ఉండాలా అనేది అతని వ్యక్తిగత ఇష్టాఇష్టాలను బట్టి ఉంటుంది. కానీ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ విషయంలో చాలామంది ఈ లాజిక్ మిస్ అవుతున్నారు.

నిజమే..ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలో మోక్షజ్ఞ స్లిమ్ గా లేడు. అదేమీ నేరమూ కాదు. ఘోరమూ అంతకన్నా కాదు. నందమూరి అభిమానులు తమ అభిమాన కథానాయకుడికి వారసుడిగా హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని.. తమను అలరిస్తాడని ఆశలు పెట్టుకున్నారు.. ఆ అంచనాలను కూడా మనం తప్పు పట్టలేం. అయితే మోక్షజ్ఞ ఫోటో మీద జరిగే రచ్చ మాత్రం హద్దులు దాటింది. అతని గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాడీ షేమింగ్ కిందకు వస్తుందని.. అది కుసంస్కారం అనే చిన్నవిషయాన్ని చాలామంది మర్చిపోయారు. పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. అతనికి ఇష్టమైతే సినిమాలలోకి వస్తాడు.. ఇష్టం లేకపోతే తనకు నచ్చిన వేరే పని చేసుకుంటాడు. ఒక ప్రముఖ కుటుంబంలో వారసుడు అయినంతమాత్రాన అతన్ని ఇలా టార్గెట్ చేయడం మాత్రం సరికాదు.

ఇప్పటికే మోక్షజ్ఞకు నటన పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే వార్తలు బయటకు వచ్చాయి. బహుశా అది నిజమే అయిఉండొచ్చు. ఆ విషయం పై బాలయ్య క్లారిటీ ఇచ్చేలోపు మోక్షజ్ఞ ఫోటో ఒక హాట్ టాపిక్ అయిందనేది మాత్రం వాస్తవం.
Please Read Disclaimer