అమ్మ- నాన్నకు ప్రేమతో బెంజ్

0

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న యువహీరో సందీప్ కిషన్. తెలుగు-తమిళం ఏదో ఒక చోట కథ నడిపిస్తూ ఎంచుకున్న కెరీర్ ని నడిపిస్తున్నాడు. ఆ ట్యాలెంట్ ఒదిగి ఉండే స్వభావం సందీప్ లో ఉందని మెచ్చుకోవడంలో తప్పేం లేదు. సక్సెస్ లుంటే గానీ అవకాశాలు రాని రోజుల్లో దాంతో పనే లేకండా సందీప్ చేతిలో ఏదో ఒక సినిమా ఉంటోంది. తొమ్మిదేళ్ల సినీ ప్రస్థానంలో ప్రతీ ఏడాది సినిమాల సంఖ్య పెరుగుతూనే ఉంది గానీ.. తగ్గిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు.

అతడి కెరీర్ ని పరిశీలిస్తే.. కేవలం 2019 క్యాలెండర్ ఇయర్ లోనే తెలుగు తమిళ్ లో కలిపి ఐదు సినిమాలు చేసాడు. వీటిలో కొన్ని రిలీజ్ అయ్యాయి. ఇంకొన్ని సెట్స్ లో ఉన్నాయి. ఇలా తన కెరీర్ బండిని సావధానంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇటీవలే నిను వీడని నీడను నేను అనే చిత్రంతో నిర్మాతగాను ఇంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో సందీప్ కు గుడ్ నేమ్ వచ్చింది. పెద్దగా లాభాలు తేకపోయినా నష్టాలైతే తీసుకురాలేదు. ఇటీవలే సందీప్ నటించిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ ప్రేక్షకుల ముదుకొచ్చింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు.

అయినా సందీప్ కెరీర్ కి సమస్యేమీ లేదు. కొత్త ఆశలు ఉత్సాహాంతోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. అందుకే తల్లిదండ్రులకు గుర్తుండిపోయే కానుకను ఇవ్వాలనుకున్నాడు. తాజాగా అత్యంత ఖరీదైన ఓ కారును బహుమానంగా అందించి పేరెంట్ పై తన ప్రేమను చాటుకున్నాడు. సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బుతో తండ్రి పి.ఆర్.పి నాయుడు.. తల్లి కనకదుర్గలకు ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ జీ.ఎల్.ఈ 350డి కారును బహుమతిగా అందించాడు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు
Please Read Disclaimer