అమ్మ యస్ అంటే యస్ నో అంటే నో

0

హీరోలు హీరోయిన్లు అందరూ తమ నిర్ణయాలను ఎవరి మీదా ఆధారపడకునడ సొంతంగా తీసుకుంటారని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అందులో వాస్తవం తక్కువ. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే సదరు హీరోయిన్ అమ్మగారో.. నాన్నగారో అసలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అప్పటి అతిలోక సుందరి దగ్గర నుంచి ఇప్పటి ఆరెక్స్ బ్యూటీల వరకూ అదే తీరు. ఇందుకు కాజల్ అగర్వాల్.. తమన్నా కూడా ఎక్సెప్షన్ కాదు. అయితే రీ-ఎంట్రీ ఇచ్చే భామల పరిస్థితి కూడా అలా ఉండడం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.

బొమ్మరిల్లు. ‘రెడీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన జెనీలియా డిసౌజా అవకాశాలు తగ్గిన తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సెటిల్ అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈమధ్య రీ-ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చింది. అయితే జెనీలియాకు సంబంధించిన విషయాలన్నీ అమ్మగారు చూస్తుండడంతో నిర్వాహకులకు ఇబ్బందిగా అనిపించిందట. ఎలాంటి హీరోయిన్లయినా ఇలా రీ ఎంట్రీ ఇచ్చే సమయంలో సొంతంగా వ్యవహరిస్తారని.. అయితే జెనీలియా మాత్రం డెసిషన్ మేకింగ్ అంతా అమ్మచేతిలోనే పెట్టిందని అంటున్నారు. సినిమా ఆఫర్ అయినా.. ఆఖరికి ఇంటర్వ్యూ అయినా అమ్మగారు ఓకే అంటేనే జెనీలియా ఒకే చెప్తుందట.

మరి జెనీలియా తన అమ్మగారి సహకారంతో సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి. పిల్లల విషయంలో కాస్త ఇన్వాల్వ్ అయితేనే జనాలు ‘బొమ్మరిల్లు ఫాదర్’ అని సరదాగా కామెంట్ చేస్తుంటారు. అయితే ఆ సినిమాలో నటించిన జెనీలియా మాత్రం తనకు పిల్లలున్నా ఇంకా ‘బొమ్మరిల్లు మదర్’ కావాలని అనుకోవడం చిత్రమే.. భళారే విచిత్రమే!
Please Read Disclaimer