మదర్ సెంటిమెంట్ తో తిప్పరా మీసం!

0

డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగిపోతున్న శ్రీవిష్ణు రేపే ‘తిప్పరా మీసం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. నిన్నే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. నెగెటివ్ టచ్ ఉన్న హీరో పాత్రలో శ్రీవిష్ణు ఇంటెన్స్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. కొందరైతే అర్జున్ రెడ్డి స్టైల్లో ఉందని కూడా పోలికలు తీసుకొచ్చారు. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. ఈ కథ గురించి మరికొంత సమాచారం బయటకు వచ్చింది.

ఈ సినిమా కథ ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ పైనే రన్ అవుతుందట. ఏమాత్రం బాధ్యతలేకుండా.. అన్నీ చెడులక్షణాలు ఉండే ఒక కొడుకు వల్ల తల్లి ఎన్ని ఇబ్బందులకు గురయింది.. చివరికి అతను అమ్మవల్లే ఎలా మంచివ్యక్తిగా మారాడు అన్నది కథ అంటున్నారు. సినిమా అంతా పూర్తి నెగెటివ్ మోడ్ లో ఇంటెన్స్ గా ఉంటుందని.. అమ్మవల్ల ఫైనల్ గా హీరోలో మార్పు వచ్చే సంఘటన మాత్రం పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం.

కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిక్కి తంబోలి హీరోయిన్ గా నటిస్తోంది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా ను రిజ్వాన్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణుకు ఒక మంచి హిట్ దక్కుతుందా లేదా అనేది మనకు రేపటికల్లా తెలిసిపోతుంది.
Please Read Disclaimer