పెళ్లి కాకుండానే తల్లులు

0

అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలు.. కట్టుబాట్లకు ఉన్న అర్థం మారిపోతుంది. బాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లికి ముందే తల్లులవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. పెళ్లికి ముందే తాము కోరుకున్న ఆనందాన్ని పొంది ఓ బిడ్డకు తల్లయిన తరువాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. ఈ కొత్త సంస్కృతి భారీ స్థాయిలోనే విస్తరించింది. సీనియర్ నటి నీనా గుప్తా పెళ్లి కాకుండానే వెస్టిండీస్ ఫేమస్ క్రికెటర్ వీవీఎన్ రిచర్డ్స్ తో ప్రేమాయణం సాగించి ఓ అమ్మాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

అక్కడి నుంచే ఈ నయా ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత ఇదే తరహాలో పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయిన వారి లిస్ట్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో భారీగానే తయారైంది. హాట్ హాట్ పాత్రల్లో ఆకట్టుకునే మహీగిల్ తన బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం సాగించి ఓ అమ్మాయికి తల్లయింది. ఆ విషయాన్ని బాహాటంగానే ఒప్పుకుంది కూడా. గోవాలో హోటల్స్ కాసినోస్ని నడిపించే ఓ బిజినెస్ మెన్ తో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. అతని ద్వారా పెళ్లి కాకుండానే తల్లయ్యానని ఇటీవల జార్జియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒప్పేసుకుంది. బ్రిటీష్ నటి అమీజాక్సన్ కూడా ఇదే తరహాలో ఓ మల్టీ మిలియనీర్ తో డేటింగ్ చేసి ఈ మధ్యే పండింటి బాబుకు జన్మనిచ్చింది. గత కొంత కాలంగా చెట్టా పట్టాలేసుకు తిరిగిన ఈ జంట పెళ్లి కాకుండానే ఓ పిల్లాడికి పేరెంట్స్ కావడం విడ్డూరంగానే వుంది.

త్వరలో ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. బాలీవుడ్ నటి కల్కీ కోచ్లిన్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో విడిపోయి ఇప్పుడు ఓ బోయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేసింది. అతని ద్వారా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది. కల్కీ ప్రస్తుతం ఐదు నెలల గర్బిణి. అర్జున్ రాంపాల్ తో డేటింగ్ లో వున్నబ్రిటీష్ మోడల్ నటి గాబ్రియెల్లా ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చింది. అర్జున్ రాంపాల్ కు ఇదివరకే పెళ్లయింది. 17 ఏజ్.. 13 ఏజ్ లో ఇద్దరు అమ్మాయిలు వున్నారు. అర్జున్ తన భార్యకు విడాకులిచ్చి గాబ్రియెల్లాతో సహజీవనం చేస్తున్నాడు. నేహా ధూపియా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఆ తరువాతే పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ లో వీరి గురించి తెలిసిన వాళ్లంతా అమ్మతనాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మారిన ట్రెండ్ లో దీనిని అపహాస్యం అనేయాలా.. లేక ఏ కోణంలో విశ్లేషించాలి?
Please Read Disclaimer