వదిలించుకోవాలనే ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నారా!

0

అనుభవం ఉన్నవారికి కొన్ని సినిమాల ఫలితం ఎలా ఉంటుందో షూటింగ్ సమయంలోనే తెలిసిపోతుంది. అయితే మధ్యలో వదిలెయ్యలేరు కాబట్టి ఎలాగో పూర్తి చేస్తారు. త్వరలో విడుదల కానున్న ఒక సినిమా సంగతి ఇలాగే మేకర్లకు డౌట్ ఉందని సమాచారం. ఏదో అనుకుని తెరకెక్కించారు కానీ ముందు అంచనాలు వేసుకున్నట్టుగా అవుట్ పుట్ రాలేదని అంటున్నారు.

అందుకే ఈ సినిమాను వదిలించుకునే ఉద్దేశంతోనే అన్ సీజన్ లో రిలీజ్ ప్లాన్ చేశారని అంటున్నారు. అసలు ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో లేదో అని టీమ్ మెంబర్స్ అందరికీ డౌట్ ఉందట. మరి అంత అనుమానం ఉన్నప్పుడు ఇలాంటి కథను ఎంచుకోవడం ఎందుకంటే నిర్మాత చేతిలో చాలా థియేటర్లు ఉన్నాయి. వాటిని రన్ చెయ్యాలంటే ఫీడింగ్ కోసం ఏదో ఒక సినిమా అయితే కావాలి. ఆ కారణంతోనే ఆయన ఏదో ఒక సినిమాను నిర్మిస్తారని.. ఈ సినిమాను కూడా అలాగే నిర్మించారని ఎగ్జిబిటర్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్దేశంతో సినిమా నిర్మిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు.

ఈ సినిమాకు ప్రమోషన్స్ పై దృష్టి పెట్టకుండా నామ్ కే వాస్తే ప్రచారం చేపట్టడానికి కారణం అదేనట. ఈ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిస్తే జాక్ పాట్ కొట్టినట్టే. లేకపోయినా థియేటర్ల ఫీడింగ్ కు ఉపయోగపడుతుంది. ఏంటో ఈ ఫీడింగ్ బిజినెస్.. సాధారణ బుర్రలకు అర్థం కాని వ్యవహారం!
Please Read Disclaimer