సినిమాలు ఫుల్లు – కలెక్షన్లు నిల్లు

0

నిన్న చెప్పుకోవడానికేమో పది దాకా కొత్త సినిమాలు విడుదలై థియేటర్లకు కొంచెం కళ వచ్చింది. కానీ అది కలెక్షన్ రూపంలో కాక కేవలం పోస్టర్లకే పరిమితం కావడం ట్రేడ్ ని నిరాశపరిచింది. మాములుగా న్యూ రిలీజ్ అంటే శుక్రవారం అధిక శాతం హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాలి. అదీ సాధ్యం కానీ పక్షంలో కనీసం ఓ డెబ్బై శాతం ఆక్యుపెన్సీ ఉంటే ఎగ్జిబిటర్ల మొహంలో నవ్వు చూడొచ్చు. కానీ ఆ ఛాన్స్ పెద్దగా లేకపోయింది.

కౌసల్య కృష్ణమూర్తికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఐశ్వర్య రాజేష్ కి ఇక్కడే ఇమేజ్ లేకపోవడంతో జనాన్ని హాల్ దాకా రప్పించలేకపోతోంది. దానికి తోడు కాస్తో కూస్తో ఆసక్తితో వెళ్ళిన ప్రేక్షకులకు ఇది రీమేకా లేక డబ్బింగా అర్థం కాని అయోమయంలో బయటికి వస్తుండటంతో ఫైనల్ గా కమర్షియల్ రేంజ్ అనుమానంగానే ఉంది. శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా తమిళ్ వెర్సటైల్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్రలో రూపొందిన ఏదైనా జరగొచ్చు ఫలితం ఏది జరగకుండానే చాలా వీక్ ఓపెనింగ్స్ తో మొదలైంది.

ఇక శకలక శంకర్ కేడి నెంబర్ 1 గురించి చెప్పుకోకపోవడమే ఉత్తమం అనే తరహాలో రిపోర్ట్స్ ఉన్నాయి. హవా – బాయ్ అనే మరో రెండు మూడు చిన్న సినిమాల పరిస్థితి వీటికి భిన్నంగా ఏమి లేదు. ఉన్నంతలో గత వారం వచ్చిన హింది సినిమాలు మిషన్ మంగళ్ లాంటి వాటి పరిస్థితి మల్టీప్లెక్సుల్లో చాలా మెరుగ్గా ఉంది. చాలా చోట్ల ఐస్మార్ట్ శంకర్ నే ఇంకా కొనసాగిస్తూ ఎవరు – రాక్షసుడుతో నెట్టుకొస్తున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాహో వచ్చేందుకు ఇంకో 6 రోజులు ఉంది కాబట్టి అప్పటిదాకా ఈ బండి లాగడాలు తప్పవు మరి
Please Read Disclaimer