ప్రభాస్‌ వదులుకున్న సినిమాల లిస్ట్‌ చూస్తే షాక్‌ అవుతారు!

0

కథ నచ్చకో, డేట్స్‌ అడ్జస్ట్ కాకనో ఒక్కోసారి కొంత మంది హీరోలు తమ దగ్గరికి వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తారు. అలా రిజెక్ట్ సినిమాలు ఫ్లాప్‌ అయితే పరవాలేదు. కానీ హిట్‌ అయితే ఆ హీరోతో పాటు ఫ్యాన్స్‌లో ఆ బాధ ఉంటుంది. అలా ప్రభాస్‌ కాదనుకున్న చాలా సినిమాలు తరువాత బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఆ లిస్ట్‌ చూస్తే అభిమానులే కాదు ఎవరైనా షాక్‌ అవుతారు.

మహేష్ కెరీర్‌ను మార్చేసిన ఒక్కడు

మహేష్‌ బాబుకు సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ అందించిన తొలి సినిమా ఒక్కడు. ఈ సినిమాతోనే మహేష్ మాస్‌ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఈ కథ ముందుగా ప్రభాస్‌ దగ్గరకు వచ్చింది. నిర్మాత ఎంఎస్‌ రాజు, దర్శకుడు గుణశేఖర్‌లు ప్రభాస్‌తో పాటు కృష్ణంరాజుకు కూడా కథ వినిపించారట. కానీ కబ్బడ్డీ బ్యాక్‌డ్రాప్‌ కావటంతో ప్రభాస్‌ అంతగా ఇష్టపడకపోవటంతో సీన్‌లోకి మహేష్‌ వచ్చాడు. ఆ తరువాత ఆ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలిసిందో.

నితిన్‌ను హీరోగా నిలబెట్టిన `దిల్‌`

వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కిన దిల్ సినిమా కథను కూడా ముందుగా ప్రభాస్‌కే వినిపించారు. ప్రభాస్‌కు కూడా కథ నచ్చినా ఆ సమయంలో మరో సినిమాతో బిజీగా ఉండటంతో దిల్ సినిమాకు డేట్స్‌ అడ్జస్ట్ చేయలేకపోయాడు. దీంతో ఆ కథ నితిన్‌ దగ్గరకు వెళ్లింది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో హీరోగా సెటిల్‌ అయిపోయాడు నితిన్‌.

రాజమౌళి మీద నమ్మకం లేక

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి కథ కూడా ముందుగా ప్రభాస్‌ హీరోగా తెరకెక్కించాలని భావించారు. అయితే రాజమౌళి అంతకు ముందుకు చేసిన స్టూడెంట్ నంబర్‌ వన్‌ ఓ మామూలు కాలేజ్‌ కథ కావటంతో సింహాద్రి లాంటి భారీ చిత్రాన్ని రాజమౌళి హ్యాండిల్‌ చేయగలడో లేదో అన్న అనుమానంతో ప్రభాస్‌ ఆ సినిమాను పక్కన పెట్టేశాడు. తరువాత ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

మరెన్నో మాస్‌ కమర్షియల్ సినిమాలు

ఇలా చాలా సినిమాలు ప్రభాస్‌ దగ్గరకు వచ్చి తరువాత ఇతర హీరోల కెరీర్‌ను మార్చేశాయి. అల్లు అర్జున్‌ను హీరోగా నిలబెట్టిన ఆర్య, ఎన్టీఆర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచిన బృందావనం, రవితేజ సూపర్‌ హిట్ కిక్‌, డాన్‌ శీను, గోపిచంద్ హీరోగా తెరకెక్కిన జిల్‌ లాంటి సినిమాలు ముందు ప్రభాస్‌ దగ్గరకు వచ్చే తరువాత ఇతర హీరోల దగ్గరకు వెళ్లాయి.
Please Read Disclaimer