హిందీ ‘జెర్సీ’ హీరోయిన్ కన్ఫర్మ్!

0

నాని హీరోగా శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ‘జెర్సీ’ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జెర్సీ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. కాని ఏవో కారణాల వల్ల కలెక్షన్స్ కాస్త తక్కువ వచ్చాయి. అయినా కూడా సినిమాకు మంచి ప్రశంసలు అయితే దక్కాయి. జెర్సీ సినిమాను ప్రస్తుతం హిందీలో అదే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ రీమేక్ లో నాని పాత్రను పోషించబోతున్నాడు. ఇప్పటికే షాహిద్ క్రికెట్ ట్రైనింగ్ పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించాడు. జెర్సీ సినిమాకు సంబంధించిన చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం హీరోయిన్. పలువురు హీరోయిన్స్ ను ఈ చిత్రం కోసం పరిశీలించిన చిత్ర యూనిట్ సభ్యులు చివరకు ఇటీవలే ‘సూపర్ 30’ చిత్రంలో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేశారు.

తెలుగు ‘జెర్సీ’కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన జెర్సీ ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ ఎంపిక విషయంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ జెర్సీ రీమేక్ కు షాహిద్ ను అనుకున్నప్పుడే నేను మృణాల్ ను అనుకున్నాను.

సూపర్ 30 లో ఆమె నటన సూపర్బ్ గా ఉంటుంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం అని కూడా దర్శకుడు చెప్పుకొచ్చాడు. తెలుగు సినిమా అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. అందుకే ఇప్పుడు జెర్సీ పై కూడా హిందీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.
Please Read Disclaimer