డర్టీ ని అందంగా చూపిస్తాడట

0

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అంటే ఠక్కున వినిపించే పేర్లలో దిల్ రాజు పేరు ముందు ఉంటుంది. మంచి కథలు ఎంపిక చేసి నిర్మిస్తాడు అంటూ దిల్ రాజు కు పేరు ఉంది. అచ్చు ఇలాంటి పేరునే గతంలో ఎంఎస్ రాజు సంపాదించాడు. ఈయన నిర్మించిన సినిమాలు అంటే బయ్యర్ల నుండి ప్రేక్షకుల వరకు అంతా ఆసక్తి చూపించే వారు. మహేష్ బాబును ఒక్కడు తో సూపర్ స్టార్ ను చేసిన ఘనత ఎంఎస్ రాజుకు దక్కుతుంది. ఇప్పుడు దిల్ రాజు ఎంత ఫేమసో అప్పుడు ఎంఎస్ రాజు అంత ఫేమస్ అయ్యాడు. కాని వరుసగా అనవసర ప్రయోగాలు మరియు వ్యాపారాల్లో నష్టాల కారణం గా ఎంఎస్ రాజు కనుమరుగయ్యాడు.

ఆయన కొడుకు సుమంత్ అశ్విన్ హీరో గా ప్రయత్నాలు చేస్తున్నాడు కాని అవి వర్కౌట్ అవ్వడం లేదు. ఎంఎస్ రాజు దర్శకుడిగా ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. దాంతో నిర్మాణం మాత్రమే కాకుండా దర్శకత్వంను కూడా వదిలేసి ఎంఎస్ రాజు సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చాడు. మళ్లీ ఈమద్య ఎంఎస్ రాజు సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తన మూడవ సినిమాను ఈయన ప్రకటించాడు.

‘డర్టీ హరి’ అనే టైటిల్ ను ప్రకటించిన ఎంఎస్ రాజు ఫస్ట్ లుక్ ను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. టైటిల్ లో డర్టీ ఉన్నా కూడా సినిమాను చాలా అందంగా యూత్ ఆడియన్స్ కు నచ్చే విధంగా తీస్తానంటూ ఎంఎస్ రాజు చెబుతున్నాడు. యూత్ ఆడియన్స్ ఈమద్య అడల్డ్ కంటెంట్ ను ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. అందుకే ఈయన అడల్ట్ కంటెంట్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడని టైటిల్ ను చూస్తుంటే అనిపిస్తుంది. అయితే అడల్ట్ కంటెంట్ అయినా కాస్త అందంగా చూపించడం వల్ల ప్రేక్షకులను మెప్పించవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే డర్టీ హరి చిత్రాన్ని కాస్త కంటెంట్ తో కాస్త అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కించి ప్రేక్షకులు మెప్పించేలా చేస్తే ఎంఎస్ రాజు మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే అంటున్నారు. మరి ఎంఎస్ రాజు ఏం చేస్తాడో చూడాలి.
Please Read Disclaimer