రియల్టీ డర్టీ.. ప్రయోగం ఫలిస్తుందా?

0

దేవి- ఒక్కడు- మనసంతా నువ్వే- నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ నిర్మించిన సీనియర్ నిర్మాత ఎం ఎస్ రాజు. కుమారుడు సుమంత్ అశ్విన్ ని హీరోగా పరిచయం చేస్తూ తూనీగ తూనీగ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. వాన అనే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు.

ఇటీవల కొంత గ్యాప్ ఆయన సడెన్ గా తెరపైకొచ్చారు. తాజాగా డర్టీ హరి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నానని ప్రకటించారు. ఈ సినిమా తో హైదరాబాదీ కుర్రాడు శ్రవణ్ రెడ్డి ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఇందులో రుహానీ శర్మ- సిమ్రత్ కౌర్ కథానాయికలు. దాదాపు 12ఏళ్ల తరువాత ఈయన మళ్ళీ ఆయన మెగా ఫోన్ పట్టుకోవడం ఆసక్తికరం. డర్టీ హరి పూర్తి గా బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో బాత్ టబ్ లో యంగ్ బోయ్.. నోట్లో సిగార్.. టబ్ లోనే ఓ అమ్మాయి కాలితో సిగరెట్ ని పెదవులకు అందిస్తోంది. ఆ పోస్టర్ చూస్తుంటే మూవీ కాన్సెప్ట్ ఏ లెవల్లో వేడెక్కించబోతుందో అర్థం చేసుకోవచ్చు. దీనిని బోల్డ్ గా పోయెటిక్ గా తెరకెక్కించనున్నారట.

ఇంతకీ ఆయనకు ఎవరు స్ఫూర్తి? అంటే బాలచందర్- పుట్టన్న కనగల్- భరతన్ వంటి టాప్ డైరెక్టర్స్ స్ఫూర్తి అని తెలుస్తోంది. సదరు సీనియర్ల తరహాలోనే సక్సెస్ సాధిస్తానని ఎం.ఎస్.రాజు చెబుతున్నారు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. త్వరలోనే టీజర్ ని లాంచ్ చేయనున్నారు.
Please Read Disclaimer