పవర్ స్టార్ ముహూర్తం ఫిక్స్

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి శుభవార్త. ఇన్నాళ్లు రీఎంట్రీ ఉంటుందా ఉండదా? అసలు పవర్ స్టార్ సినీప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ఇవ్వలేదా? అన్న డైలమా కొనసాగింది. తాజా సమాచారం ప్రకారం.. ఇక ఈ సందేహాలకు తెర పడినట్టే.

అవును.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించే కొత్త మూవీ లాంచ్ కి డేట్ ఫిక్సయ్యింది. ఆ మేరకు తుపాకికి ఎక్స్ క్లూజివ్ సోర్స్ అందింది. పవర్ స్టార్ కంబ్యాక్ మూవీ `పింక్` తెలుగు రీమేక్ ఫిక్సయ్యింది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ లో పింక్ టైటిల్ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన బోనీ కపూర్ ఆ తర్వాత అదే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి ఇక్కడా బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు తెలుగులోనూ ఆయన మార్క్ చూపించేందుకు బరిలో దిగుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని ఆయన ఇదివరకూ కలిసి కథ వినిపించారు. ఒప్పించేశారు. అయితే అది ఇప్పటికి క్లారిటీగా కన్ఫామ్ అయ్యింది. వేణు శ్రీరామ్ ని ఆయన ఫైనల్ చేసారని తెలుస్తోంది. అయితే దిల్ రాజుతో కలిసి బోనీకపూర్ తో ఈ చిత్రాన్ని జాయింట్ వెంచర్ గా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఇంతకుముందు దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో `ఓ మై ఫ్రెండ్` చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్-శ్రుతిహాసన్ నాయకానాయికలుగా నటించారు. ఎట్టకేలకు రాజుగారి ప్రయత్నం సఫలమై మరోసారి వేణు శ్రీరామ్ కి లైన్ క్లియర్ అయ్యిందని తెలుస్తోంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంత పెద్ద స్టార్ తో అతడికి కాలం కలిసి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక పవన్ కల్యాణ్- వేణు శ్రీరామ్- దిల్ రాజు- బోనీకపూర్ కాంబినేషన్ ఖాయమైనట్టే. అయితే దీనికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర క్రియేసన్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందుకోసం పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్. సుదీర్ఘంగా రాజకీయాల్లో పోరాటం సాగించేందుకు నిశ్చయించుకున్న పవన్ ఎట్టకేలకు మనసు మార్చుకున్నారన్న దానిపై మూవీ లాంచింగ్ డే రోజున పూర్తి క్లారిటీ వచ్చేస్తుందన్నమాట!!
Please Read Disclaimer