అందుకే చిరంజీవి మొగుడయ్యాడు: మురళీమోహన్

0

మురళీమోహన్. తెలుగు ఇండస్ట్రీలో హీరోగా మొదలైన ఆయన ప్రయాణం ఒక నిర్మాతగా ఒక బిసినెస్ మ్యాన్ గా.. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయ నాయకుడిగా.. యాక్టర్ నుండి ప్రజల సేవకుడిగా మారిపోయాడు. ఎన్నో వందల సినిమాలు చేసి కుటుంబకథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి మురళీమోహన్ మావాడురా.. అనేటటువంటి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. హీరోగా కృష్ణంరాజు కృష్ణలతో పాటు స్టార్ హోదాను పొందిన ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు.

మురళీమోహన్ మొదటిసారి అన్నగారు ఎన్టీఆర్ ని చూసినప్పుడే కాళ్ళమీద పడిపోయానని ఆయనంటే అంత గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. ఇక సూపర్ స్టార్ కృష్ణతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లోనే కృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని ఇక సినిమాల్లోకి వచ్చాక లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పొందాడని తెలిపాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ.. చిరంజీవిని మొదటిసారి మనవూరి పాండవులు సినిమా టైంలో చూసినట్లు తెలిపాడు.

ఆ సమయంలో కృషంరాజు నేను మాట్లాడుకుంటున్నప్పుడు చిరంజీవి గురించి ప్రస్తావన వచ్చిందట. అప్పుడు కృష్ణంరాజు “ఈ అబ్బాయివి కళ్ళు బాగున్నాయి. కళ్ళతోనే హావభావాలు బాగా పలికిస్తున్నాడు. విలన్ గా పెద్ద ఫ్యూచర్ ఉందని అన్నాడట. ఇంతలో నేనందుకొని “ఆ అబ్బాయి పెద్ద విలనే కాదు తెలుగు ఇండస్ట్రీకే పెద్ద మొగుడవుతాడని” అన్నట్లు చిన్న స్మైల్ ఇచ్చాడు. అంతే మురళీమోహన్ వాక్కు నిజమైంది. చిరంజీవి కాస్తా మెగాస్టార్ గా తనముందే ఎదిగిన తీరును చూసి ఆనందంగా ఉందంటూ మురళీమోహన్ సెలవిచ్చారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-