మహేష్ కి ఫ్లాప్..మురుగదాస్ ఏమన్నాడంటే?

0

ఎప్పటి నుండో అనుకుంటూ ఎట్టకేలకు ‘దర్బార్’ తో సూపర్ స్టార్ రజినీ కాంత్ ను డైరెక్ట్ చేసాడు మురుగదాస్. నిజానికి ఈ కాంబోలో సినిమా గజిని తర్వాతే రావాలట. గజిని చూసిన వెంటనే మనం కలిసి సినిమా చేద్దాం అంటూ మురుగదాస్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడట సూపర్ స్టార్. అయితే ఎప్పటి నుండి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న రజినీతో సినిమా ఎట్టకేలకు జరిగిందని తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు మురుగదాస్.

ఇక మహేష్ పిలిచి మరీ అవకాశం ఇస్తే ‘స్పైడర్’ తో ఫ్లాప్ ఇచ్చానని ఇప్పటికీ ఆ విషయం తలుచుకొని బాధ పడుతుంటానని చెప్పుకున్నాడు. ఇక మహేష్ పైకి తెల్లగా ఉన్నట్టే తన మనసు కూడా తెలుపే అని తెలిపాడు. సినిమా ఫ్లాప్ అయ్యాక కూడా తనతో వారం రోజులు చాట్ చేసి ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్ అనేవి కామన్ అని దైర్యం చెప్పి అంతే క్లోజ్ గా మాట్లాడారని అన్నాడు.

ఇక అల్లు అర్జున్ తో సినిమా ఇంకా డిస్కర్షన్ స్టేజిలో ఉందని త్వరలోనే ఆ సినిమా గురించి తెలియజేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక దర్బార్ ద్వారా రజినీ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అభిమానిగా అలాగే చూపించే ప్రయత్నం చేశానని అన్నాడు.
Please Read Disclaimer