‘దిశ’ ఘటనను వదలని మురుగ

0

వైద్యురాలు దిశ ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనమైందో తెలిసిందే. హత్యాచారం అనంతరం బాధితురాలిని దహనం చేయడం.. అనంతరం నిందుతులను పట్టుకుని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం ఇదంతా ఓ సినిమా స్టోరీనే తలపించింది. దోషుల ఎన్ కౌంటర్ తో హైదరాబాద్ ఎస్పీ సజ్జన్నార్ ప్రజల్లో రియల్ హీరో అయిపోయారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ప్రజలు జేజేలు పలికారు. పోలీసులపై పూల వర్షం కురిపించారు. అయితే ఇలాంటి సన్నివేశమే దర్బార్ లో కూడా ఉంటుందిట. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో ముంబై నేపథ్యంలో దర్బార్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో రజనీ ముంబై పోలీస్ కమీషనర్ గా కాప్ పాత్రలో కనిపంచనున్నారు.

ముంబైలో సాధారణ సమస్యలు ఎలా ఉంటాయి? అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? క్రైమ్ ఎలా జరగుతుంది? వంటి అంశాలతో ఈ చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కించారు. ఇక ముంబై పోలీసులను ప్రజలు రియల్ హీరోల్లానే చూస్తారని మురగదాస్ అంటున్నారు. తాజాగా ఈ సినిమాలో దిశలాంటి ఘటన ఒకటుందని మురగదాస్ రివీల్ చేసారు. దిశ ఘటనకు ముందే సినిమాలో ఈ సన్నివేశాన్ని రాసుకున్నారుట. సరిగ్గా దర్బార్ షూటింగ్ సమయంలో దిశ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుందని మురగదాస్ తెలిపారు.

వాస్తవానికి ఈ విషయాన్ని రజనీకాంత్ ఫోన్ చేసి మురగదాస్ కి చెప్పారట. అచ్చంగా మన సినిమాలో లాగే జరిగింది. ఎంత యాధృచ్ఛికం అంటూ రజనీ బాధపడ్డారని తెలిపారు. రజనీ పాత్ర రియల్ పోలీసాఫీసర్ సజ్జనార్ లా ఉంటుందని చెప్పకనే చెప్పారు. రజనీ స్టైల్లో ఆ పాత్రలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయని ధీమాను వ్యక్తం చేసారు. అలాగే రజనీ పాత్రలో మంచి హాస్యం కూడా ఉందని తెలిపారు.
Please Read Disclaimer