మళ్లీ అదే మ్యూజిక్ ఏమిటో మురుగ

0

సౌత్ లో ప్రస్తుతం ఉన్న అతి కొద్ది మంది సంగీత దర్శకుల్లో అనిరుధ్ రామచంద్రన్ పనితనంపై అంతో ఇంతో గురి ఉంది. అతడికంటూ మ్యూజిక్ లవర్స్ లో ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే అతడు ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ని అందించాడు. అజ్ఞాతవాసి లాంటి చిత్రానికి అనిరుధ్ ఇచ్చిన సంగీతం .. క్రియేటివ్ ట్యూన్లు అతడికి తెలుగు నాటా ఫాలోయింగ్ ని పెంచాయి. సినిమాల జయాపయాలతో సంబంధం లేకుండా అనిరుధ్ ని అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అతడు కూడా అందరిలానే తప్పు చేస్తే ఎలా? ఆ ప్రభావం సినిమా రిజల్ట్ పైనా పడకుండా ఉంటుందా?

మంచి సంగీతం పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తుంది. కానీ రొటీన్ దరువు మాత్రం నెగెటివిటీని పెంచి పోషిస్తుంది. తాజాగా రిలీజైన ‘దర్బార్’ ట్యూన్ విన్న తర్వాత మెజారిటీ వర్గాల అభిప్రాయమిది. దుమ్ము ధూళి అంటే రజనీ రేంజును పొగిడేసే లిరిక్ ని ఎంచుకున్నా మళ్లీ అదే పాత ట్యూన్ వినిపించింది. దళపతి నుంచి పేట వరకూ వినిపించిన అదే పాత మ్యూజిక్ వినిపించారే! అంటూ ఒకటే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొటీన్ కి భిన్నంగా క్రియేటివ్ గా బాణీ కుదిరితేనే ఈ సినిమా ఎత్తుగడలోనూ ఏదో కొత్తదనం ఉందన్న ఫీల్ కలుగుతుంది. లేదంటే మళ్లీ మరో పేట సినిమా తీస్తున్నారా? అన్న సందేహం కూడా కలగవచ్చు. ఇంతకుముందు పేటకు కూడా ఇదే తరహా రైమింగ్ తో ట్యూన్ వినిపించింది. గానగంధర్వుడు ఎస్.పి.బాలు ఎంతో ఎనర్జిటిక్ గా ఈ గీతాన్ని ఆలపించారు. అదొక్కటి మినహా కొత్తదనం ఫీల్ మిస్సయ్యాయనే చెప్పాలి. మురుగదాస్ – అనిరుధ్ కాంబినేషన్ ట్యూన్ విషయంలో మళ్లీ అదే పాత తప్పును రిపీట్ చేయడమేంటో అభిమానులకు మింగుడుపడడం లేదు.

దళపతి లాంటి క్లాసిక్ డేస్ లోనే రజనీ చిత్రాలకు క్రియేటివ్ గా మ్యూజిక్ అందించారు. భాషా లాంటి మైండ్ బ్లోయింగ్ సినిమాకి మ్యూజిక్ ఎంత పెద్ద ప్లస్సో తెలిసిందే. భాషాకి బీజీఎం సైతం ఎంతో పెద్ద మైలేజ్ ని ఇచ్చింది. ఇక రజనీకి ఏ.ఆర్.రెహమాన్ అందించిన ప్రతి ట్యూన్ కొత్తదనంతోనే మైమరిపించాయి. మరి ఇప్పుడు వాటన్నిటినీ భేరీజు వేసుకుంటే అనిరుధ్ ట్యూన్ తేలిపోయినట్టే. కనీసం ఇకపై వచ్చే సింగిల్స్ లో అయినా పస ఉంటుందేమో చూడాలి.

దుమ్ము- ధూళి…నేనేరా ఇక మీద ఉన్న చోటే దర్బారు.. ఉన్నా నీ గ్యాంగు నేనేరా లీడు….అంటూ రౌడీల తుక్కు రేగ్గొట్టే రజనీని చూపించబోతున్నారు. ఈ మాస్ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో ఆలపించారు. రజిని మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ పాటపై మ్యూజిక్ లవర్స్ పెదవి విరిచేస్తున్నారు మరి.
Please Read Disclaimer