థమన్ భయ్యా.. అమ్మకు భలే విషెస్ చెప్పాడే

0

టాలీవుడ్ లోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరు. క్రేజీ సినిమాలకు పని చేస్తూ మ్యూజిక్ లవర్స్ ను మెప్పిస్తూ ఉంటాడు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ప్రాణం పోస్తాడు. ప్రొఫెషన్ విషయంలో ఇలా ఉన్న థమన్ పర్సనల్ లైఫ్ లో తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిస్తాడు. ఈ రోజు థమన్ అమ్మగారు సావిత్రి పుట్టినరోజట. అందుకే ట్విట్టర్ ద్వారా అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద మెసేజ్ పెట్టాడు.

అమ్మగారితో కలిసి ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేసిన థమన్ “మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే టు మై డియర్ అమ్మ. డియర్ సావిత్రి.. నీ లైఫ్ ను ఇంకా సంతోషంగా ఉండేలా చేయడానికి ఇంకా ఎంతో చేయాలని ఉంది.. అలా చేస్తానని నేను నీకు హామీ ఇస్తున్నాను. లవ్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యూ మోర్.. అండ్ మోర్ మోర్” అంటూ అమ్మగారిపై తన ప్రేమను కురిపించాడు. పేరెంట్స్ ను పట్టించుకోకుండా వదిలేసి అమెరికాలు ఆఫ్రికాలు ఆఫ్ఘనిస్తాన్ లకు వెళ్లి సెటిల్ అయి అదే గొప్పదనం అనుకుంటున్నఈరోజుల్లో అమ్మపై ఇలా ప్రేమను కురిపించడం.. పైగా సోషల్ మీడియాలో ఏమాత్రం మొహమాటపడకుండా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం సూపర్ కదా. ఈ పోస్టుకు స్పందిస్తూ చాలామంది ఫాలోయర్లు థమన్ అమ్మగారికి శుభాకాంక్షలు తెలపడం విశేషం.

థమన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘డిస్కో రాజా’.. అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంలో ఒక సినిమాకు కన్నడలో మరో సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.
Please Read Disclaimer