‘మీటూ’లో బుక్కైన సంగీత దర్శకుడు

0

లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సాగుతున్న ‘మీటూ’ ఉద్యమంలో ఓ పెద్ద తలకాయ ఇర్కుకుంది. సినీ రాజకీయాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన మహిళలు సినీ తారలు వాటిని వివరిస్తూ ఆ సెలెబ్రేటీలను బజారు కీడుస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు అనుమాలిక్ కూడా అడ్డంగా బుక్కయ్యాడు. ఈ మేరకు తనపై వచ్చిన లైంగిక ఆరోపణలతో ఇండియన్ ఐడల్ 11 నుంచి తప్పుకున్నారు.

అనూమాలిక్.. బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు. ఆయనపై సింగర్లు సోనా మహాపాత్ర నేహాబాసిన్ అలీషా చినాయ్ శ్వేతా పండిట్ వంటి వారు లైంగిక ఆరోపణలు చేశారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని అనుమాలిక్ ఖండించారు.

అయితే సింగర్ల ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. దీన్ని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసింది. అనుమాలిక్ జడ్జిగా వ్యవహరిస్తున్న సోనీ టీవీకి నోటీసులు జారీ చేసింది. దీంతో సోనీ టీవీ అనుమాలిక్ ను జడ్జిగా తీసివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇక మహిళలపై లైంగిక ఆరోపణలు చేసిన అనుమాలిక్ విషయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సృతీ పట్టించుకోరా అని సింగర్ సోనా మహాపాత్ర ట్వీట్ చేసింది. ఇది కూడా దుమారం రేపింది. మొత్తంగా అనుమాలిక్ ఆరోపణల వ్యవహారం అటు ఆయన పోస్టుకు ఎసరు తేగా.. ఇటు జాతీయంగాను హాట్ టాపిక్ గా మారింది.
Please Read Disclaimer