బన్నీ పద్మశ్రీ డిమాండ్.. హాట్ టాపిక్ అయిందే

0

అల్లు అర్జున్ కొత్త సినిమా ‘అల వైకుంఠపురములో’ ఆడియో సూపర్ హిట్ అయిన సందర్భంగా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాటలను లైవ్ లో పెర్ఫామ్ చెయ్యడమే కాకుండా ‘అల వైకుంఠపురములో’ టీమ్ మెంబర్స్ ఇంట్రెస్టింగ్ స్పీచులు ఇచ్చారు. వీరిలో స్టైలిష్ స్టార్ స్టార్ స్పీచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. బన్నీ తన మాటలలో నాన్నగారు అల్లు అరవింద్ గురించి ఎమోషనల్ గా మాట్లాడారు.

నాన్నగారిని ఎక్కువగా అపార్థం చేసుకుంటారని చెప్పిన అల్లు అర్జున్ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు కానీ పద్మశ్రీ అవార్డును ప్రదానం చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై సోషల్ మీడియా లో చర్చలు కూడా మొదలయ్యాయి. తన కుటుంబం విషయంలో అరవింద్ గారు ఎంతో చేసి ఉండొచ్చు కానీ ప్రజలకు అయన ఏం సేవలు చేశారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు.. ఇండస్ట్రీలో ఎంతోమంది పేదలు ఉన్నారు.. వారికేమైనా మేలు చేశారా? ఇండస్ట్రీలో ఎవరి అభివృద్ధి గురించి అయినా కృషి చేశారా? అంటూ కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలే సంధిస్తున్నారు.

పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి ఎలాంటి అంశాలు పరిగణన లోకి తీసుకుంటారో ఏమో కానీ అల్లు అరవింద్ కు పద్మశ్రీ ఇవ్వాలనే డిమాండ్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ప్రశ్నలకు అల్లు క్యాంప్ సభ్యులు ఎలాంటి సమాధానాలు ఇస్తారో వేచి చూడాలి.
Please Read Disclaimer