దేవరకొండతో మైత్రీ బాలీవుడ్ ఎంట్రీ?

0

తెలుగులో ఉన్న టాప్ బ్యానర్స్ లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘సవ్యసాచి’ ఒక్కటి పక్కనబెడితే మైత్రీ వారి ట్రాక్ రికార్డు సాధారణమైనది కాదు. ఇక మైత్రీ వారు ప్రస్తుతం దాదాపు 10 ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. అందులో కొన్ని రిలీజుకు సిద్దంగా ఉండగా మరి కొని వివిధ ప్రొడక్షన్ స్టేజిల్లో ఉన్నాయి. కొన్ని ప్లానింగ్ దశలో ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం మైత్రీ వారు విజయ్ దేవరకొండతో ఒక త్రిభాషా చిత్రం ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకోసం ఒక లీడింగ్ బాలీవుడ్ డైరెక్టర్ ను లాక్ చేశారట. తెలుగు – తమిళ – హిందీ మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంటే ఈ సినిమాతో మైత్రీవారు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టే. ఇప్పటికే టాలీవుడ్ లో సత్తా చాటిన మైత్రీ తమిళ – హిందీ మార్కెట్లపై కూడా ఫోకస్ చేయడం విశేషం.

ఈ సినిమా కాకుండా మైత్రీ వారు విజయ్ దేవరకొండ తో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాతో భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది.
Please Read Disclaimer