లిరికల్ వీడియో : మన్మథుడు 2

0

వచ్చే నెల 9న విడుదల కాబోతున్న నాగార్జున మన్మథుడు 2 మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కంప్లీట్ ఫామిలీ ఎంటర్ టైనర్ గా క్లాసిక్ టైటిల్ కి సీక్వెల్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదే ఊపులో సినిమాలో కూడా ఇదే కంటెంట్ ఉంటే హిట్టు ఖాయమనే మాట అభిమానుల్లో వినిపిస్తోంది. ఈ సందర్భంగా మొదటి ఆడియో సింగల్ ని విడుదల చేసింది టీమ్.

నాలో నీవేనా ప్రేమై నేడు పూచేనా అంటూ సింగల్ ఫిమేల్ వెర్షన్ లో సాగే ఈ పాటను చిన్మయి శ్రీపాద పాడగా శుభం విశ్వనాథ్ సాహిత్యం సమకూర్చారు. స్లోగా మెలోడీగా స్టార్ట్ అయినా ఆ తర్వాత వేగం పుంజుకుని ప్రేయసి మనసులో తన ప్రియుడి పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో సరళమైన పదాలతో ప్రయోగించిన తీరు బాగుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం ఆహ్లదకరంగా ఉండగా ఒక్కసారిగా కాకపోయినా మెల్లగా స్లో పాయిజన్ లా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది

లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ చాలా కూల్ గా ఉన్నాయి. నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య కెమిస్ట్రీఆకట్టుకునేలా ఉంది. వన్ సైడ్ వెర్షన్ కాబట్టి నాగ్ రకుల్ ల స్టెప్స్ కానీ డాన్స్ మూమెంట్స్ కానీ ఇందులో ఏమి లేవు. కేవలం ప్రేయసి కోణంలో వచ్చే పాట కనక అందుకు తగ్గట్టే చిత్రీకరణ ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన మన్మథుడు 2 లో సమంతా-కీర్తి సురేష్-అక్షర గౌడ క్యామియోలు చేసారు. వెన్నెల కిషోర్ – రావు రమేష్ – లక్ష్మి – ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించిన మన్మథుడు 2 విడుదలకు ఇంకో 10 రోజులు మాత్రమే టైం ఉండటంతో అభిమనులు కౌంట్ డౌన్ మొదలుపెట్టేసుకున్నారు




Please Read Disclaimer