బెంజ్ కారుతో హల్ చల్ చేస్తున్న నభా నటేష్

0

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు వాళ్ళకి పరిచయం అయ్యింది నభా నటేష్. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. హీరోయిన్ గా కూడా నభా నటేష్ బాగా చేసింది అని పేరు తెచ్చుకుంది. కానీ పెద్ద అవకాశాలు మాత్రం ఆమెకు రాలేదు. వరుస ప్లాప్స్ తో ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నాడు. పూరీ జగన్నాథ్ గత చిత్రాలను దృష్టిలో పెట్టుకున్న సినీ అభిమానులు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. అయితే ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. హీరో రామ్ కి ఎంత పేరొచ్చిందో నభా నటేష్ కి కూడా ఈ సినిమాలో అంతే పేరొచ్చింది. తెలంగాణ అమ్మాయిగా నభా చేసిన యాక్టింగ్ కుర్రకారు మతులు పోగొట్టింది.

ఇప్పుడు ఎక్కడ ఏ సినిమా ఫంక్షన్ జరిగినా ఆమె స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ప్రతి ఫంక్షన్ లో ఆమె కనిపిస్తుంది. ఆమె లేటెస్ట్ గా బెంజ్ కార్ కొని ఆ కారుతో ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో తన అభిమానులకు గ్రాటిట్యూడ్ చెప్తూ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమె ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న ‘సోలో బతుకే సో బెటర్’ – మాస్ మహారాజ రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు హిట్ అయితే నభా స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం.
Please Read Disclaimer