అందాల విందును వడ్డిస్తున్న నభా నటేష్

0

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ భామ నభా నటేష్. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్ర విజయం తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది. పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్ చిత్రసీమలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నభా నటేష్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. నేటి యువతరానికి కావాల్సిన అందం – అభినయం రెండూ తనలో ఉన్నాయని నిరూపించుకుంది. మాస్ క్యారెక్టర్ తో పాటు హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తూ దర్శకనిర్మాతలకు గాలం వేసేసింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి.

సోషల్ మీడియాలో ఈ భామకు ఫాలోయర్స్ కూడా ఎక్కువే. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అలా పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. అందమైన బాడీ స్ట్రక్చర్ ను కలిగి ఉండి కళ్ళలో ఓపలేని మోహాన్ని మోస్తున్నట్లు ఆమె ఫోజును చూస్తే ఎవ్వరైనా విరహవేదనతో రగిలిపోవాల్సిందే. అందమైన ముఖారవిందంతో – అధరాలలో తేనెలు చిందిస్తున్నట్లుగా ఉంది. ఈ ఫోటో కుర్రకారుకి నిద్రపట్టకుండా చేస్తుందంటే అతిశయోక్తి కాదు. నాభా నటేష్ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘సోలో బ్రాతుకే సో బెటర్’ – బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని పెద్ద చిత్రాలు చర్చల దశలలో ఉన్నట్లు సమాచారం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-