రేటు పెంచిన ఇస్మార్ట్ భామ?

0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియన్స్ అండతో కలెక్షన్లు స్టడీగానే మైంటైన్ చేస్తున్నాడు. రెండో వారంలో అడుగు పెట్టాక అరవై కోట్ల గ్రాస్ కు చేరువ కావడం పట్ల టీమ్ హ్యాపీగా ఉంది. ఫైనల్ ఫిగర్స్ ఎంత వస్తాయనే దాని మీద మంచి ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఇద్దరు హీరోయిన్లలో స్పేస్ కొంచెం తక్కువే దక్కినా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ ఇప్పుడీ సక్సెస్ పుణ్యమా అని రేట్ పెంచినట్టుగా టాక్. 25 లక్షల నుంచి 40 లక్షల దాకా అడుగుతున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట.

ఇంతకు ముందు తను చేసిన సినిమా సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే. అదీ కమర్షియల్ గా పెద్దగా పే చేయలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ దిశగా వెళ్లడం అందులో తన మాస్ మ్యానరిజమ్స్ కు రెస్పాన్స్ బాగుండటంతో నభా లెక్క విషయంలో బెట్టు చేస్తోందట. సరే డిమాండ్ ఉన్నప్పుడు ఇలా చేయడం సహజమే కానీ వాస్తవానికి తనకు పెద్ద ఆఫర్స్ రావడం లేదని వినికిడి.

కారణం ఏంటా అని చూస్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అబ్బాయి గంటా రవి హీరోగా రూపొందే అతని రెండో సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు నభ ఒప్పుకుందట. దాని వల్లే ఇతర స్టార్ ప్లస్ మీడియం రేంజ్ హీరోలు నభా వైపు ఆసక్తి చూపడం లేదనేది సదరు వార్తల సారాంశం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం మంచిదే కానీ మరీ ఇలా ఇష్టం వచ్చినట్టు సర్దుకోకుండా తెలివిగా వ్యవహరించాలి. నభ నటేష్ ఈ విషయంలో అంత చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు లేదు. డిస్కో రాజాలో రవితేజతో చేస్తున్న నభకు ఇస్మార్ట్ క్రేజ్ ని ఎంత వరకు వాడుకుంటుందో చూడాలి
Please Read Disclaimer