ఆమె ఎక్స్‌పోజింగ్‌ న భూతో న భవిష్యత్‌!

0

నన్ను దోచుకుందువటే చిత్రంతో పరిచయం అయిన నభా నటేష్‌ దాంతో పాటు అదుగో అనే మరో చిత్రంతోను ఫ్లాప్‌ మూటగట్టుకుంది. క్యూట్‌ లుక్స్‌ వున్నా కానీ లక్‌ లేదని టాలీవుడ్‌ పెదవి విరిచింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ని బడ్జెట్‌లో తీయాలని ప్లాన్‌ చేసిన పూరి జగన్నాథ్‌ కంట్లో నభా పడింది. అంతకుముందు ఆమె చేసిన పాత్రలకి భిన్నంగా పూర్తి స్థాయి గ్లామరస్‌ పాత్రని ‘ఇస్మార్ట్‌’లో చేయించాడు. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ కంటే కూడా నభా నటేష్‌ పాత్ర హైలైట్‌ అవుతుందని అంటున్నారు. బూతు మాటలు మాట్లాడడమే కాకుండా రెచ్చిపోయి అందాల ప్రదర్శన కూడా చేసిందట.

ఇస్మార్ట్‌ శంకర్‌లో రామ్‌ పాత్ర ఎంత మాస్‌గా వుంటుందో అంతకు మించి నభా క్యారెక్టర్‌ వుంటుందని, ఈ చిత్రం ఫలితం ఏదయినా కానీ నభా నటేష్‌కి మాత్రం ఫుల్‌ అటెన్షన్‌ లభిస్తుందని చెప్పుకుంటున్నారు. అప్పుడే రవితేజతో డిస్కోరాజాలో అవకాశాన్ని దక్కించుకున్న నభా నటేష్‌తో ఇప్పటికే పలువురు నిర్మాతలు టచ్‌లో వున్నారు. ఇస్మార్ట్‌ కనుక క్లిక్‌ అయితే ఇక నభా నటేష్‌ వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదంటున్నారు. మరి పూరి మార్కు హీరోయినిజం వికటిస్తుందో లేక నభా కెరియర్‌ వికసిస్తుందో దేఖ్‌లేంగే!
Please Read Disclaimer