భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

వెచ్చగా అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

0

టాలీవుడ్లోకి న్యూ జెనరేషన్ బ్యూటీలు చాలామందే వస్తున్నారు కానీ అందరికీ పాపులారిటీ దక్కదు. కొందరికి మాత్రం త్వరగానే బ్రేక్ వస్తుంది.. ఇక ఆగకుండా కెరీర్లో దూసుకుపోతారు. బెంగళూరు భామ నభ నటేష్ విషయంలో ప్రస్తుతం అదే జరుగుతోంది. నభ మొదట్లో నటించిన సినిమాలు హిట్ కాలేదు కానీ పోయినేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా నభకు సూపర్ పాపులారిటీ వచ్చేసింది.

టిక్ టాక్.. హలో తరం భామ కాబట్టి ఇన్స్టాగ్రామ్ అనేది ఓ జుజుబి. అందుకే హాట్ ఫోటోషూట్లు చేసి ఆ ఫోటోలను ఇన్స్టా లో పోస్ట్ చేసి నెటిజన్ల హార్ట్ బీట్ ను పెరిగేలా చేస్తోంది. తన గ్లామర్ సంప్రదాయాలను కొనసాగిస్తూ తాజాగా కొన్ని ఫోటోలను అలాగే పోస్ట్ చేసింది. ఆ ఫోటోలకు “వెచ్చగా” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి ఆ వెచ్చటి క్యాప్షన్ కు అర్థం ఏమిటో హాటు నెటిజన్లకే ఆర్థం కావాలి.. ఘాటు అంతర్జాలికులకే తెలియాలి. సింపుల్ గా ఛోళి.. లెహెంగా ధరించి నభ సెన్సువల్ పోజులిచ్చింది. ఒక ఫోటోలో తలపై చేతిని పెట్టుకుని.. మరో ఫోటోలో రెండు చేతులతో తన శిరోజాలను సవరించుకుంటున్నట్టుగా రచ్చ చేసేసింది. ఈ ఫోటోలలో మరీ గ్లామరసం ఒలికించలేదు కానీ అందంగా.. క్యూట్ గా నాటిగా కనిపించింది.

ఇలాంటి ఫోటోలకు కామెంట్లు పెట్టేందుకు ఎంతోమంది నెటిజన్లు తమ పనులు అన్నీ మానేసి కూర్చుని ఉంటారు. అలాంటి వారితో పాటుగా పని ఉండేవారు కూడా చాలా కామెంట్లు పెట్టారు. “ఇస్మార్ట్ హాటీ”.. “వెచ్చగా కాదు.. హాటుగా”.. “స్కిన్ కలర్ సూపర్” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక నభ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో నటిస్తోంది. సంతోష్ శ్రీనివాస్ – బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-