నభా బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్

0

కన్నడ భామ నభా నటేష్ మొదట కన్నడ సినిమాలతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత టాలీవుడ్ లో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. నిజానికి రవిబాబు ‘అదుగో’ సినిమానే నభ తొలి తెలుగు సినిమా అయినా రిలీజ్ లేట్ కావడంతో సెకండ్ ఫిలిం గా మారింది. ఈమధ్య ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నభ ఓ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఇక సోషల్ మీడియాను గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్ల హృదయాలను ఇస్మార్ట్ గా కొల్లగొడుతోంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి “చూస్తున్నా” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఎవరిని చూస్తోంది? కెమెరాను సూటిగా చూస్తూ ఆ కెమెరాల లెన్సుల ద్వారా నెటిజన్ల కళ్ళలోకి సూటిగా చూస్తోంది. ఇక ఫోటో విషయానికి వస్తే పూల డిజైన్ ఉండే నలుపు రంగు ఛోళి.. లెహెంగా ధరించి ఒక కుర్చీలో కూర్చుంది. వెనక వైపుకు తిరిగి మెరిసే కళ్ళతో భలే పోజిచ్చింది. ఈ ఫోటోలో హైలైట్ ఏంటంటే ఇస్మార్ట్ బ్యాక్.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి మంచి స్పందనే దక్కింది. “ఎక్సలెంట్ బ్యాక్ బ్యూటీ”.. “క్యూట్ బేబీ డాల్”.. “బ్లాక్ కాఫీ సో హాట్”.. “అలా ఓరగా చూడకు” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక నభా నటేష్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘డిస్కోరాజా’.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-