నేను ఒకరిని ఇబ్బంది పెట్టే టైపు కాదు

0

బ్లాక్ బస్టర్ `ఇస్మార్ట్ శంకర్` ఎవరికి బాగా కలిసొచ్చింది అంటే రామ్ కంటే నభా నటేష్ కే ఎక్కువ ప్లస్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. సుధీర్ బాబు `నన్ను దోచుకుందువటే` సినిమా మ్యూజికల్ గా హిట్ అయినా..బాక్సాఫీస్ హిట్ కాదు. ఆ మూవీలో నభా ఎనర్జీ చూసి.. పూరి పిలిచి మరీ ఇస్మార్ట్ శంకర్ లో ఛాన్స్ ఇచ్చాడు. అందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన టర్కీ కోడిగా ఇరగదీసింది. ఇదంతా పూరి చలువే. అటుపై వరుసగా నభా రెండు మూడు అవకాశాలు అందుకుంది. ఇటీవలే `డిస్కోరాజా` రిజల్ట్ తేడా కొట్టినా నభాకు మాత్రం పేరొచ్చింది.

ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయితేజ్ సరసన `సోలో బ్రతుకే సో బెటర్` లో నటిస్తోంది. అయితే ఈ సినిమాకి పారితోషికం పెంచేసిందంటూ ప్రచారం సాగుతోంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత అమ్మడు పారితోషికం పెంచేసేందని .. వెంట వెంటనే రెండు ప్రాజెక్ట్ ల్లో నిర్మాతల ముక్కు పిండుతోందని ప్రచారం ఉంది. తాజాగా పారితోషికంపై వచ్చిన కథనాలపై నభా స్పందించింది. నాకు ఎంతివ్వాలో నిర్మాతలకు తెలుసు. ఎంత ఛార్జ్ చేయాలో నాకు తెలుసు. ఆ విషయంలో ఇద్దరం క్లారిటీగానే ఉన్నాం. నేను ఇప్పుడిప్పుడే ఈ రంగంలో నిలదొక్కుకుంటున్నాను.

ఇంకా డిమాండ్ చేసే స్థాయికి చేరుకోలేదు. అయినా నేను ఒకరిని ఇబ్బంది పెట్టే టైపు కాదు. అలాంటి మనస్తత్వం నాకు లేనే లేదు అంది. నిర్మాతలు నా ఇమేజ్ కి ఎంత సరిపోతుందనుకుంటే అంతే తీసుకుంటాను. అలాగని మరీ తక్కువ ఇస్తే మాత్రం నిర్మోహమాటంగా తిరస్కరిస్తాను. ఆ విషయంలో ఎవరైనా ఒకటేనని నభా క్లారిటీ ఇచ్చింది. అంటే నభా మాటల్లో ఓ విషయం క్లియర్ గా అర్ధమవుతోంది. తన ఇమేజ్ కు తగ్గ పారితోషికం ఇస్తే బ్యానర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తానని తెలివి గానే చెప్పేసింది. స్టార్ హీరోల కోసం వెయిట్ చేయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవడంలో నభా తర్వాతే అని అర్థం చేసుకోవాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-