నభ పెయింటింగ్ టైమ్

0

బెంగళూరు భామ నభ నటేష్ మొదట్లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే పోయినేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా నభకు సూపర్ పాపులారిటీ వచ్చేసింది. ఆ సినిమా తర్వాత నభకు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. నభ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అప్డేట్లు ఇవ్వడం మర్చిపోదు.

బిజీగా ఉన్నప్పుడే అప్డేట్లు ఇచ్చే భామ ఇప్పుడు ఫుల్లుగా ఖాళీగా ఉంటే అప్డేట్లు ఇవ్వకుండా ఎలా ఉంటుంది? అందుకే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న ఈ భామ పెయింటింగ్స్ వేస్తూ తన ఏకాంతాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. పెయింట్ బ్రష్ లు.. పెయింట్లు.. వైట్ కాన్వాసులు అన్నీ రెడీ చేసుకుని వాటి మధ్యలో పడుకుని పోజిచ్చింది. పొట్టిగా ఉండే నిక్కర్.. టీ షర్టు ధరించి కళ్ళు మూసుకుని ఏదో తన్మయత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఫోటోకు #పాజిటివిటి ఓవర్ ప్యానిక్.. #సోషల్ డిస్టెన్సింగ్ అంటూ హ్యాష్ టాగ్స్ జత చేసింది. అంటే సిసలైన హీరోయిన్ లాగా ఇంట్లో కూర్చుని కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తోంది.

ఇలాంటి ఫోటోలకు కామెంట్లు పెట్టేందుకు ఎంతోమంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. “కిల్లర్ బ్యూటీ”.. “రియల్ పెయింటింగ్”.. “హాట్ డ్రెస్” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక నభ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో నటిస్తోంది. సంతోష్ శ్రీనివాస్ – బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-