కరోనాని లెక్కచేయని ఇస్మార్ట్ భామ

0

కరోనా సృష్టించిన భయాందోళనల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ టాలీవుడ్ మరియు ఇతర ప్రాంతీయ చిత్ర పరిశ్రమలు కరోనా ఎఫెక్ట్ వల్ల చిత్ర నిర్మాణాలను కొన్ని రోజులు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపాయి. మన టాలీవుడ్ లో కూడా కరోనా ప్రభావ పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోబడుతుందని చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. నిర్మాతల మండలి సూచన మేరకు కొంత మంది నిర్మాతలు షూటింగ్స్ ను సినిమా రిలీజ్లను వాయిదా వేసుకున్నారు.

అయితే సినీ పెద్దల నిర్ణయానికి విరుద్ధంగా కొన్ని సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలిసింది. నభా నటేశ్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకం పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా యూనిట్ కరోనా ప్రభావాన్ని లెక్కచేయకుండా షూటింగ్ కొనసాగిస్తోందని తెలిసింది. ఇండస్ట్రీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నానని తెలిసినా నభా నటేశ్ ప్రొఫెషనల్గా షూటింగ్లో పాల్గొంటుందని వార్తలు వినపడుతున్నాయి. ఈ షెడ్యూల్ వాయిదా పడితే మళ్లీ కాల్షీట్స్ సమస్య వస్తుందని భావించిన నిర్మాతలు తగు జాగ్రత్తలతో పాటు యూనిట్ సభ్యుల కోసం బెంగళూరు నుండి ప్రత్యేకమైన మాస్కులను తెప్పించి షూటింగ్ను పూర్తి చేస్తున్నారట. ఏదేమైనా ఇస్మార్ట్ భామ నభా నటేష్ కు సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.
Please Read Disclaimer