ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ…?

0

యంగ్ బ్యూటీ నభా నటేష్ పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా నభా నడుము సొగసు కుర్రకారు హృదయాల్లో అలజడి క్రియేట్ చేసింది. ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నభా నటేష్ సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘అదుగో’ ‘డిస్కోరాజా’ సినిమాల్లో నటించినప్పటికీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలో నాభా నటేష్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సరసన ‘సోలో బ్రతుకే సో బెటర్’ మరియు బెల్లకొండ శ్రీనివాస్ సరసన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇస్మార్ట్ బ్యూటీ నభా టాలీవుడ్ లో ఓ బంపర్ ఆఫర్ కొట్టేసిందని సమాచారం. అది కూడా ఏ మిడిల్ రేంజ్ హీరోతో అనుకుంటే పొరపాటే. నభా ఏకంగా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ కొట్టేసిందట.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్న తారక్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ (చిన్నబాబు) – కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు నటిస్తానని ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుండి డిస్కస్ జరుగుతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందని.. ఒక హీరోయిన్ ని బాలీవుడ్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తున్నారని రకరకాలుగా వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ని ఫైనలైజ్ చేశారట చిత్ర యూనిట్. ఈ సినిమాలో నభా తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతోందని సమాచారం. అయితే మరి నభా మెయిన్ లీడ్ చేయబోతోందా లేదా సెకండ్ హీరోయిన్ అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాతో నభా స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలున్నాయని ఆమె ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోకి సెకండ్ హీరోయిన్స్ కి పెద్దగా ప్రాధాన్యం ఉండదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. మరి నభా నటేష్ కి ఈ సినిమా ఎలాంటి గుర్తింపు తీసుకురానుందో చూడాలి. ఇక నభా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ మరియు ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు దాదాపుగా పూర్తయ్యాయి. పరిస్థితులు చక్కబడి షూటింగ్స్ స్టార్ట్ అయితే మిగతా భాగం షూట్ చేయనున్నారు.
Please Read Disclaimer