డెబ్యూ హీరో తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్

0

తెలుగులో వరుసగా రెండు ఫ్లాప్ అందుకున్న నిధి అగర్వాల్ ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఓ గ్రాండ్ హిట్ అందుకుంది. సినిమాలో నభా నటేష్ కి ఎక్కువ పేరొచ్చినా నిధి కూడా గ్లామర్ షోతో సినిమాకు ప్లస్ అయింది. అయితే ఆ సినిమా తర్వాత ఇంత వరకూ తెలుగులో సినిమా ఒప్పుకోలేదు ఈ బ్యూటీ.

తాజాగా నిధి ఓ డెబ్యూ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఆ డెబ్యూ హీరో మరెవరో కాదు మహేష్ మేనల్లుడు గల్లా అశోక్. ఇతగాడి సినిమా ఆ మధ్య దిల్ రాజు బ్యానర్ లో సినిమా ప్రారంభించి ఆగిపోయింది. అయితే మళ్లీ ప్రాజెక్ట్ సెట్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను గల్లా జయదేవ్ నిర్మిస్తాడని తెలుస్తుంది.

త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

సో త్వరలోనే ఇస్మార్ట్ బ్యూటీ అశోక్ గల్లా తో రొమాన్స్ చేయనుందన్నమాట. మరి ఈసినిమాతో నిధి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home