ఈసారి బెల్లకొండ బాబుకు ఇస్మార్ట్ భామ

0

యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ చాలాకాలంగా ఎదురుచూస్తున్న విజయం రీమేక్ సినిమా ‘రాక్షసుడు’ తో దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాను ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా ఓ యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం అని సమాచారం. ఇందుకోసం తీవ్రంగా కసరత్తులు చేసి ఇప్పటికే సిక్స్ ప్యాక్ ఫిజిక్ సాధించాడు. గడ్డం కూడా పెంచి కొత్తగా కనిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బెల్లంకొండ బాబుతో సరసాలాడేందుకు ఇస్మార్ట్ భామను ఎంచుకున్నారట. ఈమధ్య ‘ఇస్మార్ట్ శంకర్’ లో ఒక హీరోయిన్ గా నటించి రామ్ తో కలిసి ఫుల్ మాస్ అవతారం బైటకు తీసిన నభా నటేష్ ఆ భామ. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో నభా నటేష్ కు డిమాండ్ పెరిగింది. అందుకే ఈ సినిమాలో బెల్లకొండ బాబు కోసం ఈ భామను ఫిక్స్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.

ఈ సినిమా విషయానికి వస్తే డిసెంబర్ లో లాంచ్ చేస్తారని.. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. అటు బెల్లంకొండ శ్రీనివాస్.. ఇటు నభా నటేష్ ఇద్దరూ సక్సెస్ లో ఉన్నారు. మరి ఇద్దరు కలిసి నటించబోయే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer