ఒరిజినల్ స్టొరీ అంటున్న నాగ్ అశ్విన్

0

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ లో నాగ్ అశ్విన్ ఒకరు. మొదటి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన నాగ్ అశ్విన్ తన రెండవ చిత్రం ‘మహానటి’ తో భారీ కమర్షియల్ సక్సెస్ తో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. రీసెంట్ గా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో ఈ సినిమాకు మూడు అవార్డ్స్ లభించాయి. సావిత్రిగారి పాత్ర పోషించి అందరినీ మెప్పించిన కీర్తి సురేష్ కు ఉత్తమనటి పురస్కారం లభించింది.

ఈ అవార్డుల పై స్పందించిన నాగ్ అశ్విన్ “మహానటి చూసినవారు చాలమంది కీర్తికి అవార్డు వస్తుందని చెప్పారు. కానీ నాకు పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే బాలీవుడ్ లో ఇతర టాలెంటెడ్ యాక్ట్రెస్ లతో పోటీ ఉంటుంది కాబట్టి వారికే ఇస్తారని అనుకున్నా. ఇదో ప్లెజెంట్ సర్ ప్రైజ్” అన్నాడు. ఇక తన నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడుతూ “నేను నెక్స్ట్ సినిమా స్క్రీన్ ప్లే పై ప్రస్తుతం వర్క్ చేస్తున్నా. అది ఒరిజినల్ స్టొరీ కావడంతో స్క్రీన్ ప్లే కోసం ఎక్కువ సమయం తీసుకుంటోంది. నేను కొంచెం స్లో.. సినిమాకు సినిమాకు మధ్య ఎక్కువ సమయం తీసుకుంటాను. అయితే నా నెక్స్ట్ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది” అన్నాడు.

నాగ్ అశ్విన్ మూడేళ్ళ సమయంలో తెరకెక్కించిన సినిమాలు రెండే. ‘మహానటి’ రిలీజ్ అయి కూడా ఇప్పటికే దాదాపు ఏడాది అయింది. ఈ లెక్కన నాగ్ అశ్విన్ కొత్త సినిమా వచ్చే ఏడాది చివరికి కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉండదు. మసాలా సినిమాలకు.. కిచిడి సినిమాలకు ఆరు నెలలు చాలు కానీ మహానటి తరహా చిత్రాలకు ఆ మాత్రం టైం పడుతుంది లెండి.. ప్రేక్షకులకు కూడా ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది!
Please Read Disclaimer