ప్రభాస్ కోసం కత్తితో సంప్రదింపులా?

0

ప్రభాస్ 21వ చిత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తాను నిర్మించబోతున్నట్లుగా అశ్వినీదత్ ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం ఓ డియర్ చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తన 21వ చిత్రంను మొదలు పెట్టబోతున్నాడు.

ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఒక్కో విషయం గురించి మీడియా లో ఎప్పటికప్పుడు న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ప్రభాస్ కు జోడీగా నటించబోతున్న హీరోయిన్ విషయంలో ప్రచారం మొదలైంది. నిన్న మొన్నటి వరకు కీర్తి సురేష్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇది ఒక పాన్ ఇండియా సినిమా కనుక బాలీవుడ్ హీరోయిన్ అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి దర్శకుడు నాగ్ అశ్విన్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

కత్తిలాంటి కత్రీనా కైఫ్ ను ప్రభాస్ కు జోడీగా సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రభాస్ హైట్ కు కత్రీనా హైట్ మరియు ఫిజిక్ కు మస్త్ సూట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభాస్.. కత్రీనాల జోడీ అదిరి పోవడం ఖాయం అంటున్నారు. షూటింగ్ ప్రారంభం సమయానికి హీరోయిన్ విషయమై క్లారిటీ ఇచ్చే ఉద్దేశ్యంతో దర్శకుడు నాగ్ అశ్విన్ చర్చలు స్పీడప్ చేశాడట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-