నాగ్ చేయబోతున్నది ఆ హీరో మూవీకి సీక్వెలా?

0

విలక్షణ శైలి ఉన్న దర్శకుడిగా పేరు దక్కించుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ వార్త గత కొన్ని రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. గరుడవేగ చిత్రంతో రాజశేఖర్ కు చాలా కాలం తర్వాత సక్సెస్ ను అందించిన ప్రవీణ్ సత్తారు మరో ఆసక్తికర కథను నాగార్జున కోసం రెడీ చేశాడని.. ఆ కథ విన్న వెంటనే నాగార్జున ఇంప్రెస్ అయ్యాడట. ప్రస్తుతం కమిట్ అయ్యి ఉన్న సినిమాలు పూర్తి అయిన వెంటనే ఆ సినిమాను మొదలు పెట్టేందుకు నాగ్ ఓకే చెప్పాడట. ఇదే సమయంలో నాగ్ ఓకే చెప్పిన కథ రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్రంకు సీక్వెల్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది.గరుడవేగ చిత్రంలో రాజశేఖర్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కనిపించిన విషయం తెల్సిందే. నాగార్జునకు చెప్పిన కథలో కూడా హీరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. ఒక మిషన్ ను సాల్వ్ చేసే కథను నాగ్ కు ప్రవీణ్ వినిపించాడంటూ ప్రచారం జరుగుతోంది. కనుక ఈ చిత్రంను గరుడవేగ చిత్రంకు సీక్వెల్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్టోరీ లైన్ ఒక్కటే అయినా కూడా ఈ చిత్రం ఆ సినిమాకు సీక్వెల్ అనుకోవడం సరికాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి నాగార్జునతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేస్తున్న ప్రవీణ్ సత్తారు వైపు సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. నాగార్జునకు ఈమద్య కాలంలో సాలిడ్ సక్సెస్ అనేది దక్కలేదు. మరి ఈసారి అయినా ప్రవీణ్ సత్తారుతో నాగ్ కు సక్సెస్ దక్కేనా చూడాలి.
Please Read Disclaimer