‘వారిద్దరూ నా పిల్లలే’ అంటున్న అక్కినేని కోడలు!

0

‘ఏ మాయ చేసావే’ సినిమాతో అందరి మనసులు దోచుకున్న తమిళ బ్యూటీ సమంత. అక్కినేని కోడలిగా ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో వివాహ జీవితం ఎంజాయ్ చేస్తోంది. సమంత నాగచైతన్య హాష్ అనే పెట్ ని పెంచుకుంటున్నారు. దాని ఆలనాపాలనా మొత్తం వీరిద్దరే చూసుకుంటారు. అయితే సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడు తన పెట్ హాష్ భర్త నాగచైతన్యలకు సంబంధించి ఏదొక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇటీవల నా పెట్ హాష్ దొంగతనం చేసిందని పోస్ట్ చేసిన సమంత.. తాజాగా తన భర్త నాగచైతన్య పెట్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది. అంతేగాక ‘మై బాయ్స్’ అంటూ కాప్షన్ కూడా మెన్షన్ చేసింది. సమంతకి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోయర్స్ కలిగి ఉంది. తను కొత్తగా ఏం చేసిన వెంటనే అభిమానులతో పంచుకుంటుంది.

ప్రస్తుతం తన భర్త చైతూ.. హాష్ ల పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సమంత ఇటీవలే ఈషా అనే యోగాసనం తన భర్తతో ప్రాక్టీస్ చేస్తోందట. ఇదిలా ఉండగా సినిమాల పరంగా అమ్మడు తెలుగులో చివరిగా ‘జాను’ సినిమాలో కనిపించింది. ఆ సినిమాలో తన నటనకు ప్రశంసలు దక్కినా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తెలుగుతో పాటు ఈ భామ తమిళ ఇండస్ట్రీలో మంచి స్టార్డం సంపాదించుకుంది. తాజాగా తెలుగులో ఇంకా ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదని తెలుస్తుంది. అయితే తమిళంలో మాత్రం విజయ్ సేతుపతి నయనతారలతో కలిసి ‘కత్తువకుల రెండు కాదల్’ అనే సినిమాలో కనిపించనుంది. ఆ సినిమాను నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం సమంత డైరెక్టర్ నందిని రెడ్డితో స్క్రిప్ట్ చర్చలలో ఉన్నట్లు సమాచారం.
Please Read Disclaimer