లవ్ స్టోరి: క్యూట్ గా ఉన్న చైతు-పల్లవి

0

అక్కినేని నాగ చైతన్య.. సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరి’. మంచి కాఫీలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేసే శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకుడు కావడంతో ఈ ‘లవ్ స్టోరి’ పై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్న ఒక పాట వీడియో ప్రోమో గురించి వెల్లడించారు.

‘ఏయ్ పిల్లా’ అంటూ సాగే పాట ప్రోమోను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు CH.పవన్. ఇక ఈ పోస్టర్లో నాగచైతన్య బ్లూ కలర్ చెక్స్ షర్టు.. బ్లాక్ ప్యాంట్ ధరించి.. భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకున్నాడు. పక్కనే సాయి పల్లవి బ్లూ కలర్ షర్టు.. మ్యాచింగ్ స్కర్టు తో క్యూట్ గా కనిపిస్తోంది. సాయి పల్లవి కూడా భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకుని ఉంది. ఇద్దరూ స్టూడెంట్స్ తరహాలోనే కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరి గెటప్ లు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ లాగానే కనిపిస్తున్నారు. నాగచైతన్య -సాయి పల్లవి జోడి ఎలా ఉంటున్నదోనని మొదట అనుమానాలు వ్యక్తం అయ్యాయి కానీ చైతు-పల్లవి జోడీ మాత్రం భలేగా ఉంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్.. అమిగోస్ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఫిదా’ లాంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి రేపు విడుదల కాబోయే పాట ప్రోమో ఈ సినిమాపై మరింత హైప్ పెంచుతుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer