టైటిల్స్ క్యూరియస్.. కానీ సక్సెస్ ఏదీ?

0

టైటిల్స్లోనే హిట్ కొట్టే సీక్రెట్ దాగి ఉందని నమ్ముతారు మేకర్స్. అందుకే టైటిల్ సెలెక్షన్ కోసం ఎంతో ఆచితూచి అడుగులేస్తారు. ఇక ట్యాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్.కె.కుమార్ ఈ విషయంలో చాలా అడ్వాన్స్ డ్ గా .. తెలివిగానే థింక్ చేస్తాడు. ఇప్పటి వరకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన చిత్రాలను గమనిస్తే.. మనం-24-హలో ఇవన్నీ రెండక్షరాల టైటిల్స్ తో ఎంతో క్యాచీగా ఆకట్టుకున్నాయి. ఇవి కాకుండా గ్యాంగ్ లీడర్ చిత్రం ఆయన తీసిన వాటిలో డిఫరెంట్ జానర్ అనే చెప్పాలి. అయితే టైటిల్స్ తో జనాల్లో పబ్లిసిటీ కలిసొచ్చినా కానీ బాక్సాఫీస్ రేస్ లో మాత్రం ఎందుకనో విక్రమ్ వెనకబడ్డాడు.

ఒకే ఒక్క మనం తప్ప ఇంతవరకూ బ్లాక్ బస్టర్ అన్నదే లేకుండా పోయింది. 24 కి పేరొచ్చిన డబ్బు రాలేదు. హలో చిత్రం సోసోనే. అందుకే అతడి విషయంలో ఏదో తేడా అయ్యిందన్నది అభిమానుల మాట. విక్రమ్ కే కుమార్ ప్రతిభావంతుడే అయినా ఎందుకనో మనం చిత్రం తర్వాత ప్రేక్షకుల నాడి పట్టలేక చతికిలబడ్డారు. అయినా ఈయనకు అవకాశాలిస్తోంది తెలుగు పరిశ్రమ.

తాజాగా అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ థాంక్యూ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇలాంటి టైటిల్ ప్రేక్షకుల్లోకి సూటిగా దూసుకెళుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్గా తన మామ వెంకటేష్ తో కలిసి వెంకీమామగా హిట్ కొట్టిన నాగచైతన్య వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చిత్రం తెరకెక్కుతోంది. ఇది నైజాం బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరి. మరో వైపు లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డికి చైతూ ఓకే చెప్పాడు. ఇలా నాగచైతన్య కెరీర్ పీక్లో ఉన్న సమయంలో విక్రమ్ కే కుమార్ తో సినిమాకి కమిటయ్యాడని ప్రచారమవుతోంది. ఈ చిత్రానికి థాంక్యూ అనే టైటిల్ ని ఎంపిక చేశారట. టైటిల్ సింపుల్ గా క్యాచీగా ఉంది. అయితే ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ చిత్రాన్ని విక్రమ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చదిద్దుతున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి మరి కొద్ది రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అయితే చైతన్యతో విక్రమ్ కె వెబ్ సిరీస్ చేస్తున్నారన్న ప్రచారంతో అసలు ఇది సినిమానా .. వెబ్ సిరీస్ నా? అన్న కన్ఫ్యూజన్ అభిమానుల్లో నెలకొంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-