నైజాం యాసతో అక్కినేని హీరో షాకిస్తాడట

0

అక్కినేని నాగచైతన్య `వెంకీమామ` చిత్రీకరణ పూర్తి చేసుకుని తదుపరి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి మరో డిఫరెంట్ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు కమ్ముల సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో చైతన్య.. సాయి పల్లవి పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. ఆ ఇద్దరి మధ్యా ప్రేమకథ.. దాంతోపాటే ఎమోషన్స్ .. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ఆకట్టుకోనున్నాయట. కమ్ముల మార్క్ సెన్సిబిలిటీస్ మైమరిపిస్తాయని చెబుతున్నారు.

అంతేకాదు.. ఈ చిత్రంలో నాగచైతన్య నైజాం యాసను మాట్లాడతారట. అందుకోసం ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారని తెలిసింది. సాయి పల్లవి .. కమ్ముల గత చిత్రం ఫిదా లో నైజాం యాసతో ఆకట్టుకుంది. అదే తరహాలో మరోసారి కనిపించబోతోందట. చైతూ- సాయి పల్లవి జంట ప్రేమాయణం .. నైజాం యాస ఆసక్తిగా ఉంటాయని తెలుస్తోంది. రౌడీ పిల్ల మరోసారి తనదైన మ్యాజిక్ చేస్తుందని ఆ పాత్రను అంత అద్భుతంగా డిజైన్ చేశారని మరో ప్రచారం ఇప్పటికే ఉంది.

తెలంగాణ నేపథ్యంలో ఆసక్తికర ప్రేమకథా చిత్రమిది. అందుకు తగ్గట్టే చైతూ ప్రిపరేషన్ సాగుతోందట. స్లాంగ్ లో ఇంప్రూవ్ మెంట్ బావుందని కమ్ముల సర్ ప్రైజ్ అయ్యారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నారాయణదాస్ నారంగ్.. పి.రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer