సామ్ సినిమాకి చైతూ రికమండేషన్!

0

పరిశ్రమలో నవతరానికి ఒక్క ఛాన్స్ దక్కాలంటే సరైన రికమండేషన్ తప్పనిసరి. అయితే రికమండ్ చేయాలంటే ప్రతిభ ఉండాలి. అలా తన ప్రతిభతో మెప్పించి రికమండేషన్ తో పాటు వరుసగా క్రేజీ సినిమాలకు అవకాశం అందుకుంటున్నారు యంగ్ సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ప్రసాద్. ఇటీవలే సమంత నటించిన `ఓ బేబి` చిత్రానికి అతడు ఛాయాగ్రహణం అందించారు. సమంత నటనతో పాటు .. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ వర్క్ కి ప్రశంసలు దక్కాయి. అయితే ఓ బేబి ఆఫర్ ఎలా వచ్చింది? అని అడిగితే రిచర్డ్ ప్రసాద్ ఇచ్చిన ఆన్సర్ ఆసక్తికరం.

రిచర్డ్ ప్రసాద్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లతో కలిసి పని చేస్తున్నారు. మారుతి.. సుధీర్ బాబు లాంటి యువ ట్యాలెంటుతో ఇదివరకూ పని చేశారు. మారుతి దర్శకత్వం వహించిన కొత్త జంట.. సుధీర్ వర్మ తెరకెక్కించిన స్వామి రారా చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. ఆ సినిమాల కెమెరా వర్క్ కి ప్రశంసలు దక్కడంతో నాగచైతన్య – సుధీర్ వర్మల `దోచెయ్` చిత్రానికి ఛాన్స్ దక్కించుకున్నాడు.

ఆ సినిమాకి పని చేసినప్పుడు చైతన్యతో ఉన్న సాన్నిహిత్యం కాస్తా `ఓ బేబి`కి రికమండేషన్ గా పని చేసిందట. ఛాయాగ్రాహకుడి కోసం వెతుకుతున్నప్పుడు.. నందిని రెడ్డి కి చైతన్యనే స్వయంగా రిచర్డ్ ప్రసాద్ పేరును సిఫారసు చేశారట. ఓ బేబికి రిచర్డ్ పనితనం అస్సెట్ అయ్యింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడం అతడి కెరీర్ కి పెద్ద ప్లస్ అవుతోందట. ఓ బేబి తర్వాత వెంటనే నందినిరెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రానికి అతడికి అవకాశం దక్కింది. ప్రస్తుతం నందిని రెడ్డి ఓ థ్రిల్లర్ స్టోరిని రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకి రిచర్డ్ సినిమాటోగ్రాఫర్ గా నందిని ఫిక్స్ చేశారు. ఒకసారి ప్రతిభావంతుడు అన్న పేరొస్తే చాలు ఇండస్ట్రీలో అలా అలా అవకాశాలు వెంటపడతాయి. పరిచయాలు స్నేహాలతోనే పనైపోతుంది. ఎవరో ఒకరు ఫలానా వ్యక్తి ప్రతిభావంతుడు అని ప్రచారం చేస్తారు. ఓబేబి తో రిచర్డ్ కి టైమ్ స్టార్టయినట్టే. సమంత నటించిన `ఓ బేబి` చక్కని వసూళ్లు సాధిస్తోంది. తొలివారం ఈ సినిమా 20 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer